Homeఎంటర్టైన్మెంట్Anshu Ambani: మన్మథుడు హీరోయిన్ సినిమాలు మానేయడానికి కారణం ఇదా... విసిగిపోయానంటూ షాకింగ్ కామెంట్స్

Anshu Ambani: మన్మథుడు హీరోయిన్ సినిమాలు మానేయడానికి కారణం ఇదా… విసిగిపోయానంటూ షాకింగ్ కామెంట్స్

Anshu Ambani: తెలుగులో ఆమె చేసింది రెండు చిత్రాలే. అయినా తన హోమ్లీ లుక్స్ తో కట్టిపడేసింది. దాంతో యువ హృదయాల్లో చోటు సంపాదించింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు అన్షు అంబానీ. 2002లో విడుదలైన మన్మథుడు సూపర్ హిట్. నాగార్జున-సోనాలి బింద్రే జంటగా నటించారు. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో సెకండ్ హీరోయిన్ గా నటించింది అన్షు అంబానీ. ఇది ఆమె డెబ్యూ మూవీ. లంగా ఓణీలో పల్లెటూరి అమాయకపు అమ్మాయిగా అన్షు అంబానీ ఆకట్టుకుంది. మన్మథుడు అనంతరం ప్రభాస్ కి జంటగా రాఘవేంద్ర మూవీ చేసింది.

రాఘవేంద్ర యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు నీలకంఠం తెరకెక్కించిన మిస్సమ్మ మూవీలో చిన్న గెస్ట్ రోల్ చేసింది. ఆమె నాలుగో చిత్రం జై. ప్రశాంత్ హీరోగా నటించిన ఈ తమిళ చిత్రం తర్వాత ఆమె మరలా కనిపించలేదు. సినిమాలు మానేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. చాలా కాలం తర్వాత అన్షు అంబానీ మీడియా ముందుకు వచ్చింది. తాను నటనకు గుడ్ బై చెప్పడానికి గల కారణం చెప్పింది.

ఇంగ్లాండ్ లో పుట్టి పెరిగిన నేను 16 ఏళ్ల వయసులో ఇండియాకు వచ్చాను. అప్పుడే మన్మథుడు మూవీలో ఛాన్స్ వచ్చింది. నా కల నెరవేరిందన్న ఆనందం కలిగింది. అనంతరం ప్రభాస్ తో రాఘవేంద్ర చేశాను. ఈ రెండు చిత్రాల్లో నేను సెకండ్ హీరోయిన్ రోల్ చేశాను. రెండు చిత్రాల్లో నా పాత్ర చనిపోతుంది. తర్వాత కూడా నాకు ఇలాంటి తరహా పాత్రలే వచ్చాయి. ఇలాంటి రోల్స్ చేయడం కంటే ఖాళీగా ఉండటం మంచిదనిపించింది. అలాంటి స్క్రిప్ట్స్ విని విసిగిపోయాను… అని అన్షు అంబానీ అన్నారు.

ఇండస్ట్రీకి వచ్చాక తన ప్రతి విషయం వాళ్ళ నాన్నే చూసుకునేవాడట. అన్షు అంబానీకి కథ చెప్పాలన్న ముందు వాళ్ళ నాన్నను కలిసేవారట. కాగా అన్షు అంబానీ 2003లో వివాహం చేసుకుంది. వీరికి ఒకరు సంతానం. అన్షు సడన్ గా సినిమాలు మానేయడంతో ఆమె ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. ఎంట్రీతోనే క్రేజీ మూవీస్ లో ఆఫర్స్ దక్కించుకున్న అన్షు అంబానీ… అది కొనసాగించలేకపోయింది.

Exit mobile version