Prashanth Varma: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవాళ్ళకి మాత్రమే క్రేజ్ ఉంటుంది. ఇక సక్సెస్ ని వాడుకున్న దర్శక నిర్మాతలకు ఇండస్ట్రీలో ఎక్కువ రోజులపాటు కొనసాగే అవకాశాలైతే పుష్కలంగా ఉంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్లు సైతం మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు ‘హనుమాన్’ సినిమాతో గొప్ప విజయాన్ని సాధించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. పాన్ ఇండియాలో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న తను ప్రస్తుతం ఏ సినిమా చేస్తున్నారనే విషయంలో క్లారిటి అయితే లేదు. ప్రస్తుతం తనతో కమిట్ అయిన చాలామంది హీరోలు తన నుంచి పక్కకు తప్పుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
హనుమాన్ సినిమా సక్సెస్ అయిన తర్వాత రన్వీర్ సింగ్ తో ఒక సినిమా చేయబోతున్నట్టు వార్తలైతే వచ్చాయి. కానీ రన్వీర్ సింగ్ కొద్ది రోజులు ప్రశాంత్ వర్మ తో ట్రావెల్ చేసి ఆ తర్వాత ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇక ఆయన తర్వాత బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ ను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నాడు.
ఇక అది కూడా వర్కౌట్ కాకపోవడంతో బాలయ్య సైతం ప్రశాంత్ వర్మ నుంచి పక్కకు తప్పుకోవడం విశేషం…ఇక వీళ్లిద్దరే కాకుండా ప్రస్తుతం ప్రభాస్ కి తను ఒక కథను వినిపించాడు. ప్రభాస్ కి సైతం ఆ కథ నచ్చినప్పటికి ప్రశాంత్ వర్మ తో సినిమా చేసే ఉద్దేశం లేదని తను చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఎందుకని డౌన్ ఫాల్ అవుతున్నాడు.
నిజానికి తనకున్న టాలెంట్ ని వాడుకొని మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది కదా ఎందుకని అతను అలా చేస్తున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఫ్యూచర్లో ప్రశాంత్ వర్మ మంచి డైరెక్టర్ గా మారాలి అంటే మాత్రం ఆయన తన కమిట్ మెంట్ డెడికేషన్ తో సినిమాలను చేసుకుంటే బాగుంటుంది…