https://oktelugu.com/

Aghora:‘అఘోర’లుగా మారుతున్న హీరోలు.. థియేటర్లలో పునకాలే..!

Aghora: టాలీవుడ్లో చాలారోజుల తర్వాత సందడి వాతావరణం కన్పిస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తో కుదేలైన టాలీవుడ్ ఇండస్ట్రీ మెల్లిమెల్లిగా పట్టాలెక్కుతోంది. కరోనా ఫస్ట్ వేవ్ లో చిన్న సినిమాలన్నీ ఓటీటీలకు పరిమితంకాగా పెద్ద సినిమాలు మాత్రం థియేటర్లు తెరిచే వరకు ఆగాయి. అయితే ఆ సమయంలో విడుదలైన సినిమాలన్నీ ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానులు నిరాశ చెందారు. కరోనా సెకండ్ వేవ్ లోనూ పలు సినిమాలు విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మాస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 5, 2021 / 12:36 PM IST
    Follow us on

    Aghora: టాలీవుడ్లో చాలారోజుల తర్వాత సందడి వాతావరణం కన్పిస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తో కుదేలైన టాలీవుడ్ ఇండస్ట్రీ మెల్లిమెల్లిగా పట్టాలెక్కుతోంది. కరోనా ఫస్ట్ వేవ్ లో చిన్న సినిమాలన్నీ ఓటీటీలకు పరిమితంకాగా పెద్ద సినిమాలు మాత్రం థియేటర్లు తెరిచే వరకు ఆగాయి. అయితే ఆ సమయంలో విడుదలైన సినిమాలన్నీ ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానులు నిరాశ చెందారు.

    Aghora as Balakrishna

    కరోనా సెకండ్ వేవ్ లోనూ పలు సినిమాలు విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మాస్ మూవీలు మాత్రం రాలేదు. మాస్ సినిమా కోసం ప్రేక్షకులు కళ్లుకాయలు కాచేలా చూస్తున్న సమయంలోనే బాలకృష్ణ ‘అఖండ’ మూవీ రిలీజైంది. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘లెజెండ్’.. ‘సింహా’ తరహాలోనే ‘అఖండ’ మూవీ ఉండటంతో ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

    ‘అఖండ’ మూవీ విడుదలైన అన్ని థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో కరోనా టైంలోనూ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సినిమాగా ‘అఖండ’ రికార్డు సృష్టించింది. ఇందులో బాలకృష్ణ చేసిన ‘అఘోర’ పాత్రకు అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. దీంతో టాలీవుడ్లో ‘అఘోర’ వెబ్రేషన్స్ మొదలయ్యాయి.

    ‘అఘోర’ పాత్రలో నందమూరి బాలకృష్ణ పరకాయ ప్రవేశం చేశాడు. అఘోరాలు సైతం థియేటర్లు వచ్చి ఈ సినిమాను చూస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆపాత్ర ఏ లెవల్లో ఉందో. ఈక్రమంలోనే అఘోర పాత్రపై పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. టాలీవుడ్లో ఇప్పటివరకు అఘోర పాత్రను ఎంతమంది హీరోలు చేశారు? మన్ముందు ఎవరెవరు ?చేయబోతున్నారని అభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు.

    బాలకృష్ణ కంటే ముందుగా సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఈ పాత్రను చేశారు. ‘శ్రీమంజునాథ’లో చిరంజీవి కొన్ని నిమిషాలు అఘోరగా కన్పించాడు. నాగార్జున ‘ఢమరుకం’లో, వెంకటేష్ ‘నాగవల్లి’ సినిమాల్లో అఘోర పాత్రల్లో కన్పించి అభిమానులను ఆకట్టుకున్నారు.

    Also Read: బాలకృష్ణ అఖండ 3 రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?

    ‘అహం బ్రహ్మస్మీ’లో మంచు మనోజ్ అఘోరగా కన్పించగా.. ‘అఘోర’ టైటిల్ రోల్ తో వచ్చిన సినిమాలో మెగాబ్రదర్ నాగబాబు అఘోరగా కన్పించారు. ‘నేనే దేవున్ని’ మూవీలో ఆర్య, ‘అరుంధతి’లో సోనూసుద్, తమిళ నటుడు శ్రీకాంత్ ‘సౌకార్ పెట్టై’లో అఘోరగా కన్పించారు. తాజాగా విశ్వక్ సేన్ నటిస్తున్న ‘గామీ’ మూవీలోనూ ఈ యంగ్ హీరో అఘోరగా కన్పించబోతున్నాడు. గామీ టీజర్ ఇటీవల రిలీజై ఆకట్టుకుంది.

    బాలకృష్ణ ‘అఖండ’ విజయంతో మరిన్ని అఘోర పాత్రలు థియేటర్లలో కనువిందు చేసే అవకాశం కన్పిస్తుంది. మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండి ఛాలెంజింగ్ గా కన్పించే ఈ పాత్రను చేసేందుకు సీనియర్, జూనియర్ హీరోలు ఆసక్తి చూపుతుండటంతో దర్శక, నిర్మాతలు సైతం కథలో భాగంగా అఘోర పాత్రను పెట్టాలని భావిస్తున్నారట. దీంతో త్వరలోనే థియేటర్లలో పునకాలు మరోసారి రావడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది.

    Also Read: అఖండ మూవీలో ఉన్న ఎద్దులు ఎవ‌రివి..? వాటి ప్ర‌త్యేక‌త‌లేంటి..?