Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: యష్మీతో ప్రేరణ చేసేది అబద్దపు స్నేహమేనా?..మొదటి వారం నుండి కాపాడుతూ...

Bigg Boss Telugu 8: యష్మీతో ప్రేరణ చేసేది అబద్దపు స్నేహమేనా?..మొదటి వారం నుండి కాపాడుతూ వచ్చిన ఆమెకు విలువ లేదా!

Bigg Boss Telugu 8: ఈ సీజన్ లో పృథ్వీ, నిఖిల్ మధ్య ఉన్న స్నేహం, అదే విధంగా తేజ, రోహిణి, అవినాష్ మధ్య ఉన్న స్నేహం తప్ప, హౌస్ లో మిగిలున్న స్నేహాలన్నీ ఫేక్ అని చూసే ఆడియన్స్ కి అనిపించింది. ముఖ్యంగా ప్రేరణ, యష్మీ మధ్య ఉన్న స్నేహం అసలు నిజం కాదు అనిపిస్తుంది. యష్మీ ప్రేరణ ని నిజంగానే స్నేహితురాలు అనుకుంది కానీ, ప్రేరణ మాత్రం అనుకోలేదు. ప్రేరణ హౌస్ లో కేవలం యష్మీ తో మాత్రమే కాదు, ఎవరితోనూ నిజమైన బాండింగ్ పెట్టుకోలేదు. కేవలం ఆమె తన గేమ్ మీద ప్రభావం చూపించకూడదు అని మాత్రమే, అవసరం మేరకు బాండింగ్ పెట్టుకున్నట్టు అనిపించింది కానీ, నిజంగా బాండింగ్ పెట్టుకున్నట్టు మాత్రం ఎవరితోనూ అనిపించలేదు. ముఖ్యంగా ప్రేరణకి యష్మీ మొదటి నుండి ఎన్నో సహాయాలు చేస్తూ వచ్చింది. యష్మీ చీఫ్ గా ఉన్నప్పుడు ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా మూడు సార్లు ప్రేరణ ని నామినేషన్స్ నుండి తప్పించింది.

అంతే కాకుండా ప్రేరణ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నంత కాలం ఆమెకు సపోర్టుగా తన గొంతు ని వినిపించి యష్మీ నెగటివ్ అయ్యింది. ముఖ్యంగా ప్రేరణ, గౌతమ్ మధ్య జరిగిన మ్యాటర్ యష్మీ ప్రేరణ కోసం నిలబడడం, దానికి గౌతమ్ ట్రిగ్గర్ అయ్యి యష్మీ మీద అరవడం. నామినేషన్స్ సమయంలో విష్ణు ప్రియ ఈ మ్యాటర్ మీద గౌతమ్ ని నామినేట్ చేయడంతో, గౌతమ్ పరిస్థితిని వివరిస్తున్న సమయంలో యష్మీ మళ్ళీ దూరడం. దానికి కోపగించుకున్న గౌతమ్ యష్మీ ని అక్కా అని పిలవడం, ఆమె ఒక రేంజ్ లో నెగటివ్ గా ట్రెండ్ అవ్వడం వంటివి జరిగాయి. అంతే కాదు, ‘కిల్లర్ గర్ల్స్’ టాస్క్ లో హౌస్ మొత్తం ప్రేరణ ని టార్గెట్ చేసి నామినేట్ చెయ్యాలని చూస్తే, ఒక్క యష్మీ మాత్రమే ప్రేరణ కోసం నిలబడి ఒక రేంజ్ లో పోరాడింది.

ఆమె కోసం అంత స్టాండ్ తీసుకుంటే, హరితేజ ఆమె క్యారక్టర్ ని ఉద్దేశిస్తూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడి, యష్మీ ని నామినేషన్స్ లోకి వేస్తుంది. ఆ సమయంలో ప్రేరణ స్పందించకుండా, నామినేషన్ అయిపోయిన తర్వాత యష్మీ కోసం స్టాండ్ తీసుకుంటుంది. అంటే ఆమె మనసులో యష్మీ ఎలిమినేట్ అవ్వాలని ఉంది. అదే విధంగా ఒకసారి ఈమెకు యష్మీ ని నామినేషన్స్ నుండి తప్పించే అవకాశం వస్తుంది. ఆ సమయంలో యష్మీ ని తప్పించకుండా, తనతో గొడవలు పడుతూ వచ్చిన పృథ్వీ ని తప్పిస్తుంది. ఇలా ఒక్కటా రెండా, ఎన్నో విషయాల్లో యష్మీ కి పోటు పొడుస్తూ వచ్చింది ప్రేరణ. నిన్న కూడా యష్మీ ప్రేరణ ని తన స్నేహితురాలిగా, తన బిగ్ బాస్ జర్నీ లో ల్యాడర్ గా పెడితే, ప్రేరణ మాత్రం రోహిణి ని ల్యాడర్ లో పెడుతుంది. రోహిణి మీద ప్రేమతో మాత్రం ఆమె పెట్టలేదు. ఎవిక్షన్ పాస్ గేమ్ లో ఈమె రోహిణి పట్ల చేసిన అన్యాయం మామూలుది కాదు. దానిని కవర్ చేసుకోవడానికే ఈ తిప్పలు. ఏది ఏమైనా ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లో ఎవరితోనూ స్నేహం చేయడం లేదు. స్నేహాన్ని తన ఆట కోసం ఉపయోగించుకుంటూ వచ్చింది. ఇక మీదట కూడా అదే చేస్తుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version