https://oktelugu.com/

Hero Vikram: ఈ స్టార్ హీరోకి కలెక్షన్స్ తో పని లేదు…డిఫరెంట్ సినిమాలు చేయడమే ఈయన టార్గెట్…

కొంత మంది హీరోలు సినిమాలతో సంబంధం లేకుండా ముందుకు దుసుకెళ్తూ ఉంటారు...వాళ్ల సినిమాలు హిట్ అయినా ప్లాప్ అయినా వాళ్లకు మంచి ఆదరణ అయితే దక్కుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : August 15, 2024 / 01:35 PM IST

    Hero Vikram

    Follow us on

    Hero Vikram: సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ ఎంత? ఆ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందనే క్యాలిక్యులేషన్స్ అందరిలో ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఆ సినిమాకి బిజినెస్ కూడా అవుతుంది. మరి ఇలాంటి క్రమంలో వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మించి కలెక్షన్స్ వస్తే ప్రొడ్యూసర్ లాభాల్లో ఉంటాడు. లేదంటే నష్టాల్లోకి వెళ్లిపోతాడు. అలాగే హీరో కూడా తన సినిమాతో సక్సెస్ అందుకుంటే తన స్టార్ డమ్ ను విస్తరిస్తూ తనకి ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తన మార్కెట్ కూడా పెరుగుతూ ఉంటుంది. తద్వారా రెమ్యూనరేషన్ కూడా భారీ లెవెల్లో ఛార్జ్ చేసే అవకాశాలు ఉంటాయి… కానీ వీటితో సంబంధం లేకుండా సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన, రెమ్యూనరేషన్ ఇచ్చిన ఇవ్వకపోయిన, మార్కెట్ తో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రలను పోషించే స్టార్ హీరోలు కొంతమంది మాత్రమే ఉంటారు. అందులో చియాన్ విక్రమ్ ఒకరు… ఆయనకి సినిమాల సక్సెస్ తో సంబంధం లేదు. ఒక వైవిధ్యమైన పాత్ర తన దగ్గరికి వచ్చిందంటే అది ఎలాగైనా సరే చేసి ప్రేక్షకులను మెప్పించాలనే ఉద్దేశంతోనే ఆయన ఎప్పుడూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే ఒక అపరిచితుడు, నాన్న తంగలాన్ లాంటి వైవిధ్యమైన పాత్రలను పోషించి ఎవరికి దక్కని ఒక క్రెడిట్ ని తను దక్కించుకున్నాడనే చెప్పాలి.

    ముఖ్యంగా ఆయన యాక్టింగే ఆయనకు వెయ్యి ఏనుగుల బలం. తను ఎలాంటి సినిమాలను చేసిన ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. 2005వ సంవత్సరంలో వచ్చిన అపరిచితుడు తర్వాత ఆయనకు ఇప్పటివరకు ఒకటి కూడా సరైన సక్సెస్ అయితే లేదు. అయినప్పటికీ 20 సంవత్సరాల కాలంలో ఆయన చాలా వైవిధ్యమైన పాత్రలను చేశాడు. తను ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండలేదు తన మార్కెట్ కూడా ఎప్పుడు డౌన్ అవ్వలేదు.

    ఒక యాక్టర్ ఒక పాత్రని నమ్మి సినిమా చేస్తున్నాడు అంటే అందులో ఏదో ఒక వైవిధ్యం అయితే ఉంటుంది. ఇలా ప్రతిసారి ప్రేక్షకులను ఏదో ఒక డిఫరెంట్ పాత్రతో పలకరిస్తూ ఉంటాడు. ఈ ఏజ్ లో కూడా విక్రమ్ ఒక పాత్ర కోసం ఆయన వెయిట్ పెరగడానికైనా, తగ్గడానికైనా రెడీ గా ఉంటాడు అంటే సినిమా కూడా ఆయనకున్న డెడికేషన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు… ముఖ్యంగా ఆయన సింపుల్ గా ఉండే పాత్రలను ఎప్పుడు సెలెక్ట్ చేసుకోరు.

    వైవిధ్యం ఉంటేనే ప్రేక్షకుల్లో తనకు ఇమేజ్ వస్తుందని అనుకుంటాడు. అలాగే తను నటించిన దానికి ఒక సాటిస్ఫాక్షన్ అయితే దొరుకుతుందనే ఉద్దేశంతో కూడా ఆయన డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ ముందుకు వెళ్తుంటాడు…ఇక ఇప్పుడు తంగలాన్ సినిమా తో మంచి గుర్తింపును కూడా పొందుతున్నాడు..