GATE 2025 Registration: గేట్‌ 2025 రిజిస్ట్రేషన్‌ ప్రారంభం.. కావాల్సిన పత్రాలు ఇవీ.. వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు..

గేట్‌ రెండు షిప్టుల్లో పరీక్షను నిర్వహిస్తోంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30, రెండో షిప్టు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో 30 అబ్జేక్టీవ్‌ టైప్‌ పేపర్‌ ఇంగ్లిష్‌లో ఉంటుంది.

Written By: Raj Shekar, Updated On : August 28, 2024 12:52 pm

GATE 2025 Registration

Follow us on

GATE 2025 Registration: గేట్‌–2025: ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ రూర్కీ (IIT Roorkee) గ్రాడ్యూయేట్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ (GATE) 2025 అప్లికేషన్స్‌ స్వీకరణ ఆగస్టు 28 నుంచి ప్రారంభించింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. తమ ఇంజినీరింగ్‌ విద్యను వివిధ కాలేజీల్లో పూర్తి చేసుకోవడానికి గేట్‌ అవకాశం కల్పిస్తోంది. ఈ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

గేట్‌ 2025 కు దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమైన తేదీలు..
రిజిస్ట్రేషన్‌ ప్రారంభం : 2024 ఆగస్టు 28
దరఖాస్తుకు చివరి తేదీ : 2024 సెప్టెంబర్‌ 26
ఆలస్య రుసుముతో..: 2024 అక్టోబర్‌ 7
పరీక్ష తేదీ: 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16.

పరీక్ష వివరాలు..
గేట్‌ రెండు షిప్టుల్లో పరీక్షను నిర్వహిస్తోంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30, రెండో షిప్టు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో 30 అబ్జేక్టీవ్‌ టైప్‌ పేపర్‌ ఇంగ్లిష్‌లో ఉంటుంది. రెండిటిలో ఏదైనా ఒక కాంబినేషన్‌ ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది. ఎగ్జామ్‌ 3 గంటల పాటు నిర్వహిస్తారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి మూడేళ్ల వరకు ఈ గేట్‌ స్కోరు వర్తిస్తుంది.

అర్హత..
ఈ గేట్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇంజినీరింగ్‌ డిగ్రీలో థర్డ్‌ ఇయర్‌ కొనసాగుతున్నవారు అర్హులు. ముఖ్యంగా టెక్నాలజీ, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్‌లో చేసిన వారు అర్హులు.

అప్లికేషన్‌ ఫీజు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 900 చెల్లించాలి. ఆలస్య రుసుముతు రూ.1,400 చెల్లించాల్సి ఉంటుంది.
ఇతరులు రూ.1,800, ఆలస్య రుసుము రూ.2,300 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకునే విధానం..
– గేట్‌ 2024 దరఖాస్తు చేసుకోవడానికి gate2025.iitr.ac.in ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
– మీ బేసిక్‌ వివరాలు నమోదు చేసి ఖాతాను సృష్టించాలి.
– ఆ తర్వాత మీ పర్సనల్, ఎడ్యుకేషనల్, సంప్రదించాల్సిన వివరాలు నమోదు చేయాలి.
– మీరు రాయాలనుకుంటున్న పేపర్‌ ఎంపిక చేయాలి.
– ఫొటో, సంతకం ఇతర కావాల్సిన ధృవపత్రాలను స్కాన్‌ చేసి సబ్మిట్‌ చేయాలి.
– చివరగా నెట్‌బ్యాంకింగ్, డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు, యూపీఐ పేమెంట్‌ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
– మీ వివరాలు మరోసారి రివ్యూ చేసి చివరగా సబ్మిట్‌ చేయాలి.

కావాల్సిన పత్రాలు..
స్కాన్‌ చేసిన ఫొటో
స్నాన్‌ చేసిన సంతకం
స్కాన్‌ చేసిన మీ కెటగిరీ సర్టిఫికేట్‌ (ఎస్సీ/ఎస్టీ) పీడీఎఫ్‌ ఫార్మాట్‌
పీడబ్ల్యూడీ సర్టిఫికేట్‌
డైస్లెక్సియా సర్టిఫికేట్‌ పీడీఎఫ్‌ ఫార్మాట్‌
ఫొటో ఐడీ (ఆధార్‌ కార్డు,పాస్‌పోర్ట్, ప్యాన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌)
మిమ్మల్ని సంప్రదించాల్సిన ఫుల్‌ అడ్రస్‌ పిన్‌ కోడ్‌తో సహా నమోదు చేయాలి
ఎడ్యుకేషనల్‌ క్వాలిఫికేషన్‌ వివరాలు
పేమెంట్‌ డిటెయిల్స్‌ (నెట్‌ బ్యాంకింగ్, డెబిట్‌/క్రెడిట్‌ కార్డు, యూపీఐ)