Venu Thottempudi: ఆరున్నర అడుగుల తెలుగు కుర్రాడు తొట్టెంపూడి వేణు… రావడంతోనే సక్సెస్ అందుకున్నారు. 1999లో విడుదలైన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ స్వయంవరం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కొత్త హీరో అయినా… సపరేట్ మేనరిజంతో వేణు అలరించారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. స్వయంవరం సినిమాతో మరో తెలుగు అమ్మాయి లయ హీరోయిన్ గా పరిచయం అయ్యారు.

మొదటి చిత్రం విజయం నేపథ్యంలో వేణుకు అవకాశాలు క్యూ కట్టాయి. చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు వంటి హిట్ చిత్రాలు ఆయనకు ఓ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. సోలో హీరోగా సక్సెస్ అవుతూనే మల్టీస్టారర్స్ కూడా చేశారు వేణు. హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే, శ్రీకృష్ణ 2006, ఖుషీ ఖుషీగా.. ఈ తరహా చిత్రాలే. ఒక దశలో వేణు టూ టైర్ హీరోగా ఇండస్ట్రీలో సెటిల్ అవుతాడని అందరూ భావించారు. అయితే ఇండస్ట్రీలో కెరీర్ ని డిసైడ్ చేసేది కేవలం విజయాలే.
Also Read: ‘వయ్యా సామి’ అంటూ హావభావాలతో ఉర్రూతలూగించిన సింగర్ భర్త ఎవరో తెలిస్తే..!
కళ్యాణ్ రాముడు, పెళ్ళాం ఊరెళితే చిత్రాల తర్వాత వేణుకు సరైన హిట్స్ దక్కలేదు. ఈ క్రమంలో ప్రయోగాలు చేసినా ఫలితం ఇవ్వలేదు. వరుస ప్లాప్స్ తో వేణు కెరీర్ ప్రమాదంలో పడింది. ఆయనకు సినిమా అవకాశాలు తగ్గాయి. దర్శక నిర్మాతలు వేణును పక్కన పెట్టారు. కెరీర్ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో గోపి గోపిక గోదావరి వంటి మంచి ఆఫర్ దక్కింది.
ప్రముఖ దర్శకుడు వంశీ చిత్రం కావడంతో ఈ మూవీతో వేణు కమ్ బ్యాక్ కావచ్చని అందరూ భావించారు వంశీ మార్కు కామెడీ, రొమాన్స్ తో గోపి గోపిక గోదావరి చిత్రం తెరకెక్కింది. చక్రి అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. పర్వాలేదు అనిపించుకున్న ఈ చిత్రం కమర్షియల్ గా ఆడలేదు. వేణు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఈ మూవీ తర్వాత వేణుకు హీరోగా దారులు పూర్తిగా మూసుకుపోయాయి.
చింతకాయల రవి మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వేణు… ఆ మూవీలో క్యామియో రోల్ చేశారు. ఎన్టీఆర్ హీరోగా బోయపాటి తెరకెక్కించిన దమ్ము మూవీలో సపోర్టింగ్ రోల్ చేశాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగే పనిలో ఉన్నారు.
శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రామారావు ఆన్ డ్యూటీ మూవీలో ఆయన కీలక రోల్ చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. హీరోగా సక్సెస్ లు చూసిన వేణు పునాది వేసుకోవడంలో విఫలం చెందాడు. సినిమా ఎంపికలో తడబడిన వేణు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. కనీసం వేణు సెకండ్ ఇన్నింగ్స్ అయినా సక్సెస్ ఫుల్ గా సాగాలని కోరుకుందాం.
Also Read: విజయవాడకు వంగవీటి పేరు పెడతారా?