
Hero Varun Tej: మెగా హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్నాడు వరుణ్ తేజ్. 33 ఏళ్ల ఈ యంగ్ హీరో పెళ్లిపై తరచుగా వార్తలు, వదంతులు వినిపిస్తూ ఉంటాయి. ఆయన మీద ఎఫైర్ రూమర్స్ కూడా ఉన్నాయి. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ ప్రేమించారన్న ప్రచారం జరిగింది. ఇద్దరూ పెళ్ళి సిద్ధమయ్యారనే కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను లావణ్య ఖండించారు. అవన్నీ అపోహలే, మా మధ్య స్నేహానికి మించి ఏమీ లేదు. ప్రేమ, పెళ్లి వార్తల్లో నిజం లేదని స్పష్టత ఇచ్చారు. మరోవైపు నాగబాబు వరుణ్ కి పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నామని ఒకటి రెండు సందర్భాల్లో ఉన్నారు.
Also Read: Singer Sunitha: రెండో భర్తతో ప్రెగ్నన్సీ… స్వయంగా స్పష్టత ఇచ్చిన సింగర్ సునీత!
ఇదిలా ఉంటే వాలెంటైన్స్ వేళ వరుణ్ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. తన లవర్ ని పరిచయం చేశాడు. అయితే వరుణ్ ప్రేమిస్తుంది అమ్మాయిని కాదు, జిమ్ ని. వ్యాయామశాల ఫోటో పోస్ట్ చేసిన వరుణ్ తేజ్ ‘హ్యాపీ వాలెంటైన్స్ డే’ అని క్యాప్షన్ ఇచ్చాడు. సదరు కామెంట్ కి లవ్ ఎమోజీ జోడించాడు. నాకు అత్యంత ప్రియమైన, ప్రేమించే ప్రదేశం జిమ్ అని ప్రేమికుల రోజు వరుణ్ పరోక్షంగా తెలియజేశాడు. వరుణ్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇక వరుణ్ కెరీర్ పరిశీలిస్తే… ప్రస్తుతం ఆయన గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున చిత్రం చేస్తున్నారు. ఫస్ట్ లుక్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా గాండీవధారి అర్జున మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరైన వరుణ్ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేస్తున్నారు.

గత ఏడాది వరుణ్ మిక్స్డ్ ఫలితాలు అందుకున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన గని అనుకున్న స్థాయిలో ఆడలేదు. గని మూవీలో వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్ రోల్ చేశారు. పాత్ర కోసం సిక్స్ ప్యాక్ బాడీ సాధించడంతో పాటు ప్రొఫెషనల్స్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. వరుణ్ కష్టానికి ఫలితం దక్కలేదు. ఇక వెంకటేష్ తో చేసిన మల్టీస్టారర్ ఎఫ్3 హిట్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తన కామెడీ పవర్ చూపించారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటించగా సునీల్, రాజేంద్రప్రసాద్ కీలక రోల్స్ చేశారు. ఇక గాండీవధారి అర్జున ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.