
Anushka Shetty Health: స్టార్ లేడీ అనుష్క శెట్టికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హీరోల మాదిరి ఆమెను ఆరాధించే అభిమానులు ఉన్నారు. స్టార్ హీరోయిన్ అనే ఇమేజ్ కి మించి అనుష్క అందం, అణకువ, మాటతీరు ప్రతిఒక్కరూ గౌరవించేలా చేశాయి. పరిశ్రమలో వివాద రహిత హీరోయిన్ గా అనుష్కకు పేరుంది. బాహుబలి సిరీస్ తో ఇండియా వైడ్ అభిమానులను సంపాదించుకున్నారు. దేవసేన పాత్రలో ఆమె అందం, హుందాతనంతో ఆకట్టుకున్నారు. డీగ్లామర్ రోల్ లో కట్టిపడేశారు.
Also Read: Hero Varun Tej: వాలెంటైన్స్ డే… తన లవర్ ని పరిచయం చేసిన హీరో వరుణ్ తేజ్!
అయితే అనుష్క అరుదుగా సినిమాలు చేస్తున్నారు. ఐదేళ్లుగా ఆమె నెమ్మదించారు. డిమాండ్ ఉన్నప్పటికీ ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. బాహుబలి 2 అనంతరం అనుష్క చేసిన సినిమాలు రెండే. భాగమతి, నిశ్శబ్దం అనే లేడీ ఓరియెంట్ చిత్రాల్లో నటించారు. సైరా నరసింహారెడ్డిలో చిన్న గెస్ట్ రోల్ చేశారు. ఇది ఒకింత ఆమె అభిమానులను నిరాశపరిచే అంశం. ఎట్టకేలకు ఆమె ఓ చిత్రానికి సైన్ చేశారు. నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ లో అనుష్క నటిస్తున్నారు.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి… అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తనకు అరుదైన వ్యాధి ఉందని చెప్పి అనుష్క షాక్ ఇచ్చారు. అనుష్కకు నవ్వు వస్తే ఆగదు అట. 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటుందట. షూటింగ్స్ సెట్స్ లో నవ్వు స్టార్ట్ చేస్తే కంటిన్యూగా నవ్వుతూనే ఉంటారట. అనుష్క నవ్వు ముగించే లోపు యూనిట్ షూటింగ్ ఆపేసి, లంచ్, స్నాక్స్ తిని కూడా వస్తారట. నవ్వును ఆపుకోలేని అరుదైన వ్యాధి తనకు ఉందని అనుష్క వెల్లడించారు.

ఇక అనుష్క వయసు నలభై ఏళ్ళు దాటిపోయింది. కానీ ఆమె పెళ్లి మాట ఎత్తడం లేదు. ప్రభాస్ ని ప్రేమిస్తున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలను అనుష్క ఖండించారు. మరోవైపు ప్రభాస్ కూడా పెళ్లి చేసుకోవడం లేదు. మరి అనుష్క పెళ్లిని దూరం పెట్టడానికి గల కారణాలు ఏమిటో తెలియడం లేదు. 2005లో సూపర్ మూవీతో అనుష్కను పూరి జగన్నాధ్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. 17 ఏళ్లుగా పరిశ్రమలో ఆమె కొనసాగుతున్నారు. అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ లో నటించారు. అరుంధతి అనుష్క కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయింది. ఆమెకు అశేష అభిమాన వర్గాన్ని తెచ్చిపెట్టింది.
Also Read: Singer Sunitha: రెండో భర్తతో ప్రెగ్నన్సీ… స్వయంగా స్పష్టత ఇచ్చిన సింగర్ సునీత!