Homeఎంటర్టైన్మెంట్Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేస్తూ చనిపోలేదు అంటున్న... హీరో శ్రీకాంత్

Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేస్తూ చనిపోలేదు అంటున్న… హీరో శ్రీకాంత్

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం కర్ణాటకే ప్రజలకే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా షాక్ కలిగించింది. కాగా ఈరోజు పునీత్ అంత్యక్రియలను ఆయన అన్న రాఘవేంద్ర రాజ్ కుమార్ కొడుకు వినయ్ రాజ్ కుమార్ నిర్వహించారు. కంఠీరవ స్టూడియో లోని పునీత్ తల్లిదండ్రుల సమాధి వద్ద ఆయనకు అంత్యక్రియలు జరిపారు. అయితే పునీత్ శుక్రవారం ఉదయం జిమ్ చేస్తూ ఛాతిలో నొప్పి రావడంతో హాస్పిటల్ కు వెళ్ళి చికిత్స పొందుతూ మరణించారని మీడియాలో కధనాలు రావడం చూశాం. అయితే ఇప్పుడు తాజాగా ఆయన అసలు జిమ్ కె వెళ్లలేదని అంటున్నారు శ్రీకాంత్.

hero srikanth sensational comments about puneeth rajkumar death

శ్రీకాంత్ వ్యాఖ్యలతో ఇప్పుడు ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. పునీత్ లేడంటే నమ్మలేకపోతున్నానని ఆయనతో కలిసి ‘జేమ్స్’ సినిమా కోసం 40 రోజులు పని చేశాను అని శ్రీకాంత్ అన్నారు. ఈ సినిమా కంటే ముందు నుంచే పునీత్ తనకి తెలుసని చెప్పారు. ఆయన అన్న శివ రాజ్‌కుమార్‌, ఆయన కుటుంబ సభ్యులు బాగా తెలుసని తెలిపారు. ‘జేమ్స్’ సినిమా షూటింగ్ ఇటీవలే దాదాపు పూర్తి అయ్యిందని… అందులో తాను  ప్రతి నాయకుడి పాత్ర చేస్తున్నట్లు చెప్పారు. తనకు బాడీగార్డుగా పునీత్ నటిస్తున్నాడని… ఇంకా ఒక ఫైట్ సీన్, పాట, మిగిలి ఉందన్నారు.

జేమ్స్ షూటింగ్ సమయంలో పునీత్ రోజు తనకు ఇంటి నుంచి భోజనం తెచ్చేవాడు అని చెప్పారు. అప్పు చాలా ఫిట్‌గా ఉంటాడని… ఎప్పుడూ హుషారుగా ఉండే వ్యక్తి అని… ఏ రోజు ఆయనకు ఫీవర్, ఇతర అనారోగ్య సమస్యలేవీ రాలేదని పునీత్ ఫ్రెండ్స్ చెప్పారని తెలియజేశారు. సూపర్ స్టార్ కొడుకు అయ్యి ఉండి కూడా అభిమానులను కౌగిలించుకుని అప్యాయంగా ఉండేవాడని అన్నారు. మీడియాలో ఆయన జిమ్‌లో వ్యాయామం చేస్తూ పడిపోయారని అంటున్నారు. అందులో నిజం లేదని అంతకు ముందు రోజు రాత్రి నుంచే… పునీత్ ఆరోగ్యం కాస్త అనారోగ్యంగా ఉన్నారని…  ఉదయం 8 గంటల సమయంలో తన ఫ్యామిలీ డాక్టర్‌ను కలిశాడని వివరించారు. అక్కడి నుంచి విక్రమ్ హాస్పిటల్‌కు వెళ్లారని చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారని చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version