Huzurabad By Elections: ఎన్నికల్లో ప్రజలంతా ఓట్లు వేసిన వీవీ ప్యాట్ మిషన్లను రాత్రికి రాత్రి కొందరు ప్రైవేటు వాహనాల్లో తరలించుకుపోవడం కలకలం రేపింది. దీన్ని గమనించిన బీజేపీ నేతలు కార్లను అడ్డుకొని గొడవకు దిగారు. పోలీసులు వచ్చి చెదరగొట్టేశారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక వి.వి.ప్యాట్ మిషన్ లను రాత్రికి రాత్రి కౌంటింగ్ సెంటర్ వద్ద మార్చుతుండగా పట్టుకున్న బి.జె.పి కార్యకర్తలు ఆందోళన చేశారు. వి.వి.ప్యాట్ మిషన్ లతో పాటు ఇ.వి.ఎం మిషన్ లను పెద్ద ఎత్తున మార్చేసినట్టు సమాచారం. ఖచ్చితం గా ఓటమి తేలడంతో పోలీసులు ఎన్నికల అధికారులతో కలిసి ఇంతటి దుర్మార్గానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో వీవీ ప్యాట్ ల గోల్ మాల్ కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి నడిరోడ్డుపై వీవీ ప్యాట్ లు కారులోకి మార్చారంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. సరైన సెక్యూరిటీ లేకుండా ప్రజలు ఓట్లేసిన ఈవీఎం, వీవీ ప్యాట్ లు తరలించారంటూ బీజేపీ ఆందోళనకు దిగింది.
ఎన్నికల నిర్వహణ తీరు, ఈవీఎంల తరలింపు నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనపై కరీంనగర్ కలెక్టర్ కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బీజేపీ నేతలు ఈటల రాజేందర్ సహా నేతలంతా ఫైర్ అయ్యారు.
వీడియో