https://oktelugu.com/

RC15: చరణ్​- శంకర్​ కాంబో సినిమా శాటిలైట్​ రైట్స్​ ఎవరివంటే?

RC15: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ చేసుతున్న చిత్రం “#RC 15 ” కోలీవుడ్ సెన్సేషన్ డెరైక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్ జంటగా కియారా అద్వానీ నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పూణే షెడ్యూల్ కంప్లీట్ చేసుకొన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం హైదరాబాద్ లో తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది చెర్రీ, కియారాల పై ఓ భారీ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీకి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 22, 2021 / 03:01 PM IST
    Follow us on

    RC15: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ చేసుతున్న చిత్రం “#RC 15 ” కోలీవుడ్ సెన్సేషన్ డెరైక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్ జంటగా కియారా అద్వానీ నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పూణే షెడ్యూల్ కంప్లీట్ చేసుకొన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం హైదరాబాద్ లో తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది చెర్రీ, కియారాల పై ఓ భారీ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసుతున్నారు. తెలుగుతో పాటు తమిళ వెర్షన్ ను కూడా ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు శంకర్. పొలిటికల్ యాక్షన్ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

    శంకర్ సినిమా లు అంటే చెప్పనక్కర్లేదు భారీ హంగులతో భారీ బడ్జెట్ తెరకెక్కిస్తారు. దాదాపు రూ. 170 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నరు. అయితే ఈ సినిమా నిర్మాణంలోకి మరో భాగస్వామిని కూడా చేర్చుకున్నట్టు సమాచారం. అగ్ర నిర్మాణ సంస్థగా పేరుపొందిన జీ స్టూడియోస్మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ 15 నిర్మాణంలో భాగస్వామి అవుతున్న విషయం తెలిసిందే.

    అయితే రీసెంట్ గా దిల్ రాజు తో జీస్టూడియోస్ ఒప్పందం చేసుకున్నట్టుగా సమాచారం.ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఇన్వెస్ట్ చేయడంతో పాటు ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను జీ స్డూడియోస్ తీసుకుంటుందాట. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.