Samantha-Allu Arjun: సామాజిక విషయాలపై తరచుగా హీరో సిద్ధార్ద్ స్పందిస్తూ ఉంటారు. పొలిటికల్ సెటైర్స్ కూడా ఆయన ట్వీట్స్ లో భాగమవుతూ ఉంటాయి. అయితే ఈ మధ్య ఆయన చిత్ర పరిశ్రమను టార్గెట్ చేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రాలు, ఆ సినిమాల వసూళ్ల గురించి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. వార్తలలో నిలుస్తున్నారు .
సమంత విడాకుల ప్రకటన చేసిన వెంటనే సిధ్దార్ద్ సోషల్ మీడియాలో స్పందించారు. ”మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు..? ఇది స్కూల్ లో టీచర్ దగ్గర నేను నేర్చుకున్న పాఠాల్లో ఒకటి” అంటూ ట్వీట్ చేశారు. ఒకరిని మోసం చేసిన నీకు మంచి ఎలా జరుగుతుంది, అనుభవించు అన్నట్లు ఆయన ట్వీట్ మీనింగ్ ఉంది. సమంత సిద్దార్థ్ తో డేటింగ్ చేశారన్న కథనాలు గతంలో వెలువడగా.. ఆయన ట్వీట్ సినిమా వర్గాల్లో చర్చకు దారితీసింది.
తాజాగా ఆయన అల్లు అర్జున్ మూవీని టార్గెట్ చేశారు. పాన్ ఇండియా చిత్రాలు, వాటి వసూళ్లు ఫేక్ అంటూ ఓపెన్ కామెంట్స్ చేశారు. పుష్ప వసూళ్లపై ఓ తమిళ ట్రాకర్ ట్వీట్ కి నేరుగా సమాధానం చెప్పారు. అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి పాన్ ఇండియా స్థాయి లేదని ఆయన అభిప్రాయం. అదే సమయంలో పుష్ప మూవీ వసూళ్ల లెక్కల్లో అసలు వాస్తవం లేదని, అవన్నీ ట్రేడ్ వర్గాలకు డబ్బులు చెల్లించి, ప్రచారం చేయించుకుంటున్నారని, ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు.
Also Read: నాగ చైతన్య – సమంత విడాకులకు కారణం నాగ్, అమల?
సిద్ధార్థ్ వ్యవహారం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని కోపానికి గురిచేస్తుంది. వారు సిద్దార్థ్ పై సోషల్ మీడియా దాడికి దిగుతున్నారు. అయినప్పటికీ ఆయన అసలు తగ్గడం లేదు. తాజాగా మరో ఘాటైన ట్వీట్ తో సిద్ధార్థ్ కొందరిని టార్గెట్ చేశారు. ”మన దేశంలో కొంతమంది తమకు తామే బిరుదులు ఇచ్చుకుంటారు. తమని తాము దేవుని ప్రతిరూపాలుగా భావిస్తారు. స్తుతించడానికి జనాలకు డబ్బులు చెల్లిస్తారు. బ్రతికున్నంత కాలం మనం వాళ్ళ చెడు గురించి మాట్లాడలేం. అలా చేస్తే మనం చచ్చిపోతాం. చనిపోయాక వాళ్ళు దేవుళ్ళు అయిపోతారు. చనిపోయాక వాళ్ళ తప్పుల గురించి ఎవరూ మాట్లాడరు. నిజానికి విలువలు మిమ్మల్ని దేవుడుగా మార్చుతాయి” అని కామెంట్ చేశారు.
కొందరు స్టార్స్ డబ్బులిచ్చి తమను పొగిడించుకుంటున్నారని , తమని తాము దేవుళ్లుగా ప్రచారం చేయించుకుంటున్నారంటూ పరోక్షంగా తెలియజేశారు. ఇక ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి అనే దానిపై స్పష్టత లేదు. అయితే పుష్ప మూవీపై రీసెంట్ గా నెగిటివ్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో.. సిద్ధార్థ్ మరలా బన్నీని టార్గెట్ చేశారని అనుకుంటున్నారు. సదరు ట్వీట్ క్రింద కామెంట్స్ కూడా ఇదే తెలియజేస్తున్నాయి.
Also Read: ‘పుష్ప’లో బన్నీకి తల్లిగా నటించిన ఆమె ఎంత స్టైలిష్ గా ఉందో చూశారా?
In India, sub-par individuals give themselves Titles, pay people to call them great and become Demi gods all on their own.
We cant say anything about them when alive or we will die. Then they die and become gods. No can say anything about the dead.
Moral- make yourself god.😭🤦🏾
— Siddharth (@Actor_Siddharth) December 24, 2021