Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం కొంచెం కష్టం , ఓయ్ , ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి , తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిల్చిపోయారు సిద్దార్థ్. ఆ తర్వాత ఆయన కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం అవ్వకుండా, బాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీస్ లో అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు ని తెచ్చుకున్నారు. అయితే ఈమధ్య కాలం లో సిద్దార్థ్ కి ఆశించిన స్థాయిలో విజయాలు రావడం లేదు. అయితే రీసెంట్ గానే ఆయన కార్గిల్ యద్ద నేపథ్యం లో తెరకెక్కించిన ఆపరేషన్ సఫేద్ సాగర్ వెబ్ సిరీస్ లో నటించారు.
రీసెంట్ గానే ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సిద్దార్థ్ ని కొన్ని సంఘటనలు కదిలించాయి. దాంతో ఆయన కంటతడి పెట్టుకున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దివంగత స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా భార్య అల్కా అహూజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్కా స్టేజి పైకి రాగానే అందరూ ఆమెకు గౌరవిస్తూ లేచి నిల్చున్నారు. తన భర్త కథని కోట్లాది మంది ఇండియన్స్ కి తెలియచేయడం కోసం తెరమీదకు తీసుకొచ్చినందుకు నిర్మాతలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడిన మాటలు సిద్దార్థ్ మనసుని కదిలింపజేశాయి. దీంతో ఆయన వేదికపై కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ సిరీస్ ని తెరకెక్కించిన మాపై ఇంత నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు సిద్దార్థ్. నిజ జీవితం లోని యోధుడి పాత్రని పోషించడానికి మొదట్లో కాస్త భయపడ్డానని , అలాంటి అమరవీరుల పాత్రలను పోషించడానికి మనపై చాలా బాధ్యత ఉంటుందని, అందుకే చాలా జాగ్రత్తగా ఈ వెబ్ సిరీస్ లో నటించానని చెప్పుకొచ్చారు సిద్దార్థ్.
‘ఈ సిరీస్ ని తెరకెక్కించే ముందు , నిర్మాతలతో చర్చినప్పుడల్లా నేను ఒక్కటే వాళ్ళని అడిగేవాడిని , ఈ సిరీస్ ని నిర్మించడానికి అల్కా అనుమతి తీసుకున్నారా లేదా ?, అదే నాకు అత్యంత ముఖ్యమైన విషయం అంటూ చెప్పేవాడిని’ అంటూ గుర్తు చేసుకుంటూ సిద్దార్థ్ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇంకా ఆయన ఏమి మాట్లాడారో ఈ క్రింది వీడియో లో చూడండి.



