Kiara Advani Marriage: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ కైరా అద్వానీ..తెలుగు లో ఈమె భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ వంటి సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది..ప్రస్తుతం రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..బాలీవుడ్ లో ఈమె రీసెంట్ గా నటించిన సినిమాలన్నీ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి..అక్కడ ఇప్పుడు ఈమె నిర్మాతల పాలిట గోల్డెన్ లెగ్ గా అందరూ పిలుస్తున్నారు.

ఇక ఈ అమ్మడు బాలీవుడ్ లో ఎప్పుడూ కూడా ట్రేండింగ్ న్యూస్ లోనే ఉంటుంది..గత కొంత కాలం నుండి ఈమె హీరో సిద్దార్థ్ మల్హోత్రా తో ప్రేమలో ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..కొద్దీ నెలలుగా వీళ్లిద్దరు డేటింగ్ కూడా చేసుకుంటున్నారు..షూటింగ్ ఖాళి సమయం లో ఫారిన్ ట్రిప్స్ వేస్తూ ఉంటుంది ఈ జంట..దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో ఇప్పటికి ట్రెండ్ అవుతూనే ఉంటాయి.
అయితే వీళ్లిద్దరు డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది..తొలుత వీళ్లిద్దరి పెళ్లిని గోవా లో చేద్దాం అనుకున్నారు..కానీ సిద్దార్థ్ తన ఫామిలీ గోవా లో పెళ్లి జరుపుకోవడానికి ఇష్టపడట్లేదు..కాస్త ఇబ్బందికి గురవుతున్నారు అని కైరా కి చెప్పగా ఇప్పుడు వీళ్ళ పెళ్లి గుజరాత్ కి షిఫ్ట్ అయ్యింది..అక్కడ ఒబెరాయ్ సుఖ్ విల్లా స్పా రిసార్ట్స్ లో వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారట..ఇక్కడ గతం లో బాలీవుడ్ క్రేజీ హీరో రాజ్ కుమార్ రావు పెళ్లి ఘనంగా జరిగింది..అప్పట్లో ఆయన పెళ్లి బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచింది..ఇప్పుడు కైరా పెళ్లి దానికి మించి ఉండబోతుందని బాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త..అయితే వీరి పెళ్లి ఎక్కడ జరుగుతుంది అనేది మాత్రం అధికారికంగా ప్రకటన జరగలేదు.

కైరా మరియు సిద్దార్థ్ మల్హోత్రా కలిసి ఇప్పటి వరుకు కేవలం ‘షంషేర’ అనే సినిమాలో మాత్రమే నటించారు..కేవలం ఈ ఒక్క సినిమా చేసారు కాబట్టే వీళ్లిద్దరు ప్రేమలో పడలేదు..బాలీవుడ్ లోకి కైరా అడుగుపెట్టినప్పటి నుండే సిద్దార్థ్ మంచి స్నేహితుడట..ఆ స్నేహ బంధం కాస్త వీళ్లిద్దరి మధ్య ప్రేమ గా మారి ఈరోజు పెద్దల సమక్షం లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.