Hero Siddardh: ఏపీ ప్రభుత్వంపై ఇన్ డైరెక్ట్ గా విరుచుకుపడ్డ హీరో సిద్దార్ధ్…

Hero Siddardh: ఏపీ సర్కారుపై ఇన్ డైరెక్ట్ గా హీరో సిద్దార్ధ్ విరుచుకుపడ్డాడు. గత కొంత కాలంగా ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్, చిరంజీవి, దర్శకుడు రాఘవేంద్ర రావు ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు. తాజాగా సిద్దార్ధ్ కూడా వీరి జాబితా లోకి చేరాడు. సినిమా, సినిమా హాళ్లు బతకడానికి అవకాశం ఇవ్వమని హీరో సిద్ధార్థ్ ట్విట్టర్ […]

Written By: Raghava Rao Gara, Updated On : December 3, 2021 9:33 am
Follow us on

Hero Siddardh: ఏపీ సర్కారుపై ఇన్ డైరెక్ట్ గా హీరో సిద్దార్ధ్ విరుచుకుపడ్డాడు. గత కొంత కాలంగా ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్, చిరంజీవి, దర్శకుడు రాఘవేంద్ర రావు ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు. తాజాగా సిద్దార్ధ్ కూడా వీరి జాబితా లోకి చేరాడు. సినిమా, సినిమా హాళ్లు బతకడానికి అవకాశం ఇవ్వమని హీరో సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా కోరారు. సినిమా టికెట్ రేట్స్ ఏపీ ప్రభుత్వానికి పరోక్షంగా ప్రశ్నలు సంధించారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

“మీరు ఓ ప్లేట్ ఇడ్లీ లేదా కాఫీ ఎంతకు అమ్మాలో ఏసీ రెస్టారెంట్ల‌కు చెప్ప‌రు. కానీ, సినిమా ఇండస్ట్రీనే ఎప్పుడూ ఎందుకు సమస్యాత్మక పరిశ్రమగా ప్రభుత్వాలు చూస్తున్నాయి. వాళ్ల పెట్టుబడి ఎలా తిరిగి రాబట్టుకోవాలో ఎందుకు చెబుతున్నారు అని సిద్ధార్థ్ ప్రశ్నించారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లపై ఓ జీవో విడుదల చేసింది. అందులో గ్రామీణ ప్రాంతాల్లో థియేటర్లలో రేటు ఐదు రూపాయలు అని కూడా ఉంది. సింగిల్ టీ కూడా అంతకంటే ఎక్కువ రేటు ఉన్నప్పుడు… సినిమా టికెట్ అంతకు అమ్మితే నిర్మాతల బతికేదెలా అంటూ చర్చ మొదలైంది. రోజుకు ఎన్ని షోలు వేయాలి, టికెట్ రేట్ ఎంత ఉండాలి అనే విషయంలో పరిమితులు విధించడం ఎమ్ ఆర్ టి పి ( మోనోపొలిస్టిక్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ అండర్ ఎమ్ ఆర్ టి పి యాక్ట్, 1969) చట్టాన్ని ఉల్లఘించడమేనని ఆయన తెలిపారు.

ఓ ప్రాంతంలో రెంట్స్ (ఇళ్ల అద్దెలు) ఎలా ఉన్నాయో తెలుసుకుని ఏవరేజ్ రెంట్ క్యాలిక్యులేట్ చేసి టికెట్ రేట్స్ నిర్ణయించమని ప్రభుత్వాలకు ఆయన సలహా ఇచ్చారు. ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు టికెట్ రేట్లు నిర్ణయించే అధికారం లేదని సిద్ధార్థ్ వ్యాఖ్యానించారు. సినిమా కంటే లిక్కర్, పొగాకు (సిగరెట్)కు ఎక్కువ గౌరవం ఇస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. #SaveCinema అంటూ నినదించారు. “మా వ్యాపారం ఎలా చేయాలో మాకు చెప్పొద్దు. మాకు పన్నులు విధించండి, సినిమాలు సెన్సార్ చేయండి… మీరు ఎప్పుడూ చేసేట్టు ఇల్లీగల్ గా. నిర్మాతలను, సినిమా పరిశ్రమపై ఆధారపడి బతికేవాళ్లను వాళ్ల జీవితాల నుంచి గెంటేయకండి. ఎవరూ సినిమా చూడమని ఫోర్స్ చేయడం లేదు. సినిమా బడ్జెట్, స్కేల్ ను ప్రేక్షకుడు నిర్ణయించలేడు. దానిని క్రియేటర్, ఇన్వెస్టర్ నిర్ణయిస్తాడు. సినిమా నుంచి ఎంత సంపాదించాలనే అధికారం ఎవరికీ లేదు. పేదరికం నుంచి వచ్చి లక్షాధికారులుగా ఎదిగిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలను ఎవరైనా ప్రశ్నిస్తారా? సినిమా ఇండస్ట్రీని అంచనా వేయడం ఆపండి” అని సిద్దార్థ్ ట్వీట్స్ చేశారు.