varun doctor: రేమో సినిమా తో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు తమిళ్ హీరో శివకార్తికేయన్ అయితే ఇటీవల విడుదలైన వరుణ్ డాక్టర్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది తమిళ్, తెలుగు, కన్నడ లో కూడా ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది అనే చెప్పాలి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో శివ కార్తికేయన్ జోడిగా ప్రియాంకా మోహన్ నటించారు. దసరా కానుకగా విడుదలైనది ఈ చిత్రం. కరోనా తర్వాత తెలుగు తమిళ కన్నడ భాషల్లో విడుదలైన ఈ చిత్రం 100 కోట్ల పైగా వసూళ్లు చేసిన తొలి చిత్రంగా నిలిచింది.అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
దీపావళి కానుకగా ఓటిటి వేదికలైన సన్ నెక్స్ట్, నెట్‌ఫ్లిక్స్ లో “వరుణ్ డాక్టర్” విడుదలైంది. ఈ మూవీ లో శివ కార్తికేయన్ ఆర్మీ డాక్టర్ గా నటిస్తారు. హీరోయిన్ చెల్లి కిడ్నాప్ చేయడంతో తన చెల్లిని వెతికే ప్రయత్నంలో కామెడీ హైలెట్ చేసి ప్రేక్షకులకు వినోదాత్మకంగా చూపించారు, ఫస్ట్ ఆఫ్ మొత్తం కామెడీ హైలెట్ గా నిలిచింది సెకండ్ ఆఫ్ థ్రిల్లర్ గా సస్పెన్స్ గా నడుస్తుంది .ఈ సినిమాకి యోగి బాబు కామెడీ ప్లస్ పాయింట్ గా నిలిచింది.
అయితే దీపావళి సందర్భంగా ఓటీటీలలో పలు కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి.అమెజాన్ ప్రైమ్ వేదికగా సూర్య ‘జై భీమ్’ జీ5 వేదికగా సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్,డిస్నీ హాట్‌స్టార్ వేదికగా సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’వీటితో పాటు “వరుణ్ డాక్టర్” సినిమా ప్రియులకు మరింత దీపావళి అందించాయి .