ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. లఖ్‌నపూ జోనల్ కార్యాలయంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా 12 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్, వాచ్‌మెన్, కౌన్సిలర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 8వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ వరకు చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
18 సంవత్సరాల వయస్సు నుంచి 63 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జోనల్ కార్యాలయం, బ్యాంక్ ఆఫ్ ఇండియా, లఖ్‌నపూ, స్టార్ హౌజ్, విభూతిఖండ్, గోమతినగర్, యూపీ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుందని తెలుస్తోంది.
రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రజెంటేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇంటర్వ్యూ ప్రక్రియ జరుగుతుంది. 2021 సంవత్సరం నవంబర్ 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు త్వరగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది. నిరుద్యోగులు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే https://www.bankofindia.co.in/ వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవడంతో పాటు ఈ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది.