https://oktelugu.com/

Sharwanand: శర్వానంద్ ఆశలన్నీ ఆ సినిమాపైనే.. అందుకే ఓటీటీ ఎంచుకున్నారా?

Sharwanand: విభిన్న కథలను ఎంచుకుని.. కామెడీ, లవ్​ ఎంటర్​టైనర్​తో పాటు ఫ్యామిలీ మెచ్చే సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్​. అయితే, ఇటీవల కాలంలో పెద్దగా హిట్​టాక్​ అందుకోవడం లేదు శర్వ. అప్పుడెప్పుడో మహానుభావుడు సినిమా తర్వాత.. మధ్యలో పడిపడిలేచే మనసుతో కాస్త ఫర్వాలేదనిపించాడు. ఇక తర్వాత వచ్చిన రణరంగం, జాను, శ్రీకారం, ఇటీవల మహాసముద్రం వరుసగా పరాజయాలతో పడిపోతున్నారు శర్వ. నిజానికి మహాసముద్రం ట్రైలర్​ చూడగానే ఈ సారి శర్వానంద్​కు హిట్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 19, 2021 / 01:33 PM IST
    Follow us on

    Sharwanand: విభిన్న కథలను ఎంచుకుని.. కామెడీ, లవ్​ ఎంటర్​టైనర్​తో పాటు ఫ్యామిలీ మెచ్చే సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్​. అయితే, ఇటీవల కాలంలో పెద్దగా హిట్​టాక్​ అందుకోవడం లేదు శర్వ. అప్పుడెప్పుడో మహానుభావుడు సినిమా తర్వాత.. మధ్యలో పడిపడిలేచే మనసుతో కాస్త ఫర్వాలేదనిపించాడు. ఇక తర్వాత వచ్చిన రణరంగం, జాను, శ్రీకారం, ఇటీవల మహాసముద్రం వరుసగా పరాజయాలతో పడిపోతున్నారు శర్వ. నిజానికి మహాసముద్రం ట్రైలర్​ చూడగానే ఈ సారి శర్వానంద్​కు హిట్​ ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ, ట్రైలర్​లో ఉన్న ఇంటెన్సిటీ సినిమాలో కనిపించలేదు.

    ఇప్పుడు ఒకే ఒక జీవితం అనే సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్​గా కనిపించనుంది. అమలు కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుతం ఈ సినిమాపైనే శర్వ ఆశలు పెట్టుకున్నాడు. టైమ్ ట్రావెల్ కథతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, తాజాగా, ఈ సినిమా గురించి మరో వార్త హాట్ టాపిక్​గా మారింది.

    ఒకే ఒక జీవితం సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు ఓటీటీ సంస్థలతో కలిసి సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. మరి నిజం ఏంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.  దీంతో పాటు, ఆడవాళ్లు మీకు జోహార్లు అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు శర్వ. కిశోర్​ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక హీరోయిన్​గా నటించనుంది.