https://oktelugu.com/

Naga Chaitanya: ఆ విషయంలో తండ్రి ట్రెండ్​ను కొనసాగిస్తున్న నాగచైతన్య!

Naga Chaitanya: చాలా మంది హీరోలు తమ సినిమాల్లో కొత్త హీరోయిన్లకు ఛాన్స్​లు ఇస్తూ ఉంటారు. వారిలో మంచి నటన, అందం కనిపిస్తే చాలు భాష ఏదైనా సరే వారికి అవకాశాలు కల్పిస్తుంటారు. అలా ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లను పరిచయం చేయడంలో ముందుంటుంది అక్కనేని ఫ్యామిలి. ముఖ్యంగా కింగ్ నాగార్జున సినిమాలతో చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అనుష్క కూడా నాగ్​ సినిమాతోనే పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కాగా, నాగ్​ తనయుడు నాగచైతన్య కూడా అదే బాట […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 19, 2021 / 01:06 PM IST
    Follow us on

    Naga Chaitanya: చాలా మంది హీరోలు తమ సినిమాల్లో కొత్త హీరోయిన్లకు ఛాన్స్​లు ఇస్తూ ఉంటారు. వారిలో మంచి నటన, అందం కనిపిస్తే చాలు భాష ఏదైనా సరే వారికి అవకాశాలు కల్పిస్తుంటారు. అలా ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లను పరిచయం చేయడంలో ముందుంటుంది అక్కనేని ఫ్యామిలి. ముఖ్యంగా కింగ్ నాగార్జున సినిమాలతో చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అనుష్క కూడా నాగ్​ సినిమాతోనే పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

    కాగా, నాగ్​ తనయుడు నాగచైతన్య కూడా అదే బాట పట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన సినిమా ద్వారా కొత్త హీరోయిన్లను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. వారిలో సమంత, పూజా హెగ్డేతో పాటు చాలా మంది ఉన్నారు. కాగా, ఇప్పుడు మరో తమిళ్​ పొన్నును హీరోయిన్​గా పరిచయం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం బంగార్రాజు, థాంక్యూ సినిమాల్లో ఫుల్​ బిజీగా ఉన్నారు నాగ్​. ఈ రెండు సినిమాలు పూర్తికాగానే విక్రమ్ కె కుమార్​ దర్శకత్వంలో ఓ వెబ్​సీరీస్​ తీయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్​ వినిపిస్తోంది. హర్రర్​ కథతో తెరకెక్కుతోన్న ఈ సిరీస్​లో నాగ్​ నెగిటివ్​ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా, వచ్చే ఏడాది ఈ సిరీస్​ షూటింగ్​ ప్రారంభం కానుందట. ఈ క్రమంలోనే తమిళ హీరోయిన్​ ప్రియా భవానీ శంకర్​ను చైతన్యకు జోడీగా ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రియా తమిళంలో పలు టీవీ షోలతో పాటు, సినిమాల్లోనూ నటించింది. కాగా, సామ్​తో విడాకుల ప్రకటన అనంతరం వరుస చిత్రాలతో ఫుల్​ బీజీ షెడ్యూల్​తో గడుపుతున్నారు చైతన్య.