kangana: మోదీ వ్యవసాయ చట్టాల నిర్ణయంపై కంగన అలా.. తాప్సీ ఇలా!

kangana: మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్వయసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఏడాది కాలంగా రైతులంతా దిల్లీ సరిహద్దులో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ చట్టాలను రద్దు చేసేలా రానున్న పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్లు మోదీ తెలిపారు. గురునానక్​ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ ఈ విషయంపై కీలక ప్రకటన చేశారు. దీంతో పలువురు రాజకీయనేతలు, సినీతారలు ఇది అన్నదాతలు సాధించిన చారిత్రక విజయమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఎప్పుడూ వివాదాల్లో కనిపించే […]

Written By: Raghava Rao Gara, Updated On : November 19, 2021 1:52 pm
Follow us on

kangana: మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్వయసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఏడాది కాలంగా రైతులంతా దిల్లీ సరిహద్దులో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ చట్టాలను రద్దు చేసేలా రానున్న పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్లు మోదీ తెలిపారు. గురునానక్​ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ ఈ విషయంపై కీలక ప్రకటన చేశారు. దీంతో పలువురు రాజకీయనేతలు, సినీతారలు ఇది అన్నదాతలు సాధించిన చారిత్రక విజయమని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఎప్పుడూ వివాదాల్లో కనిపించే బాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ కంగనా రనౌత్​ ఈ విషయంపై స్పందించింది. ఈ నిర్ణయం పూర్తిగా అన్యాయమని పేర్కొంది. దీంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. దేశమంతా ఈ నిర్ణయంపై పండగ చేసుకుంటున్న వేళ.. కంగనా మాత్రం బిన్నంగా స్పందించింది. ఓ నెటిజన్​ పోరాటాల శక్తి నిరూపించిన ఫలితమింది.. అంటూ చేసిన పోస్ట్​ను కంగనా షేర్ చేస్తూ.. చాలా విచారకరం, అవమానం అని వ్యాఖ్యానించింది. పార్లమెంటులో ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా వీధి పోరాటం చేస్తున్న వ్యక్తులు చట్టాలు చేయడం ప్రారంభించినట్లయితే, ఇది కూడా జిహాదీ దేశమే. ఇలా కోరుకునే వారందరికీ అభినందనలు అంటూ  సెటైర్స్‌ వేసింది.

మరోవైపు తాప్సీ కూడా మోదీ నిర్ణయంపై స్పందించింది. మోదీ నిర్ణయాన్ని అభినందిస్తూ.. రైతులకు గురుపూరబ్​ శుభాకాంక్షలు తెలిపింది. పంజాబీ, సిక్కు ప్రజలకు  ఘనంగా జరుపుకునే గురునానక్ పండగ ఈ గురుపూరబ్​. తాప్సీ కూడా సిక్కు కావడంతో మొత్తం రైతు సంఘాన్ని, ప్రత్యేకించి పంజాబ్‌ రైతులను అభినందిస్తూ ట్వీట్ చేసింది.