Hero Sharvanand : అందరు హీరోలు లాగా కాకుండా తానూ తీసే సినిమాలు విలక్షణంగా ఉంటూ ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేసే చిత్రాలను తియ్యాలని పరితపిస్తుంటాడు హీరో శర్వానంద్..ఇతని కెరీర్ ని ఒకసారి పరిశీలించి చూస్తే కమర్షియల్ సినిమాలకంటే ప్రయోగాత్మక సినిమాలే ఎక్కువ..అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద తన తోటి యువ హీరోలకంటే వెనకబడి ఉంటాడు శర్వానంద్..ఈమధ్య కాలం లో వరుసగా ఆరు డిజాస్టర్ ఫ్లాప్స్ అందుకున్న తర్వాత అతను చేసిన లేటెస్ట్ చిత్రం ‘ఒకే ఒక జీవితం’ మంచి సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక ఆ సినిమా తర్వాత శర్వానంద్ మరో సినిమాని ఇప్పటి వరకు ప్రారంభించలేదు..ప్రముఖ దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య తో ఒక సినిమా చేస్తునట్టు పలు ఇంటర్వ్యూస్ లో తెలిపాడు కానీ షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు..దీనితో అసలు శర్వానంద్ కి అసలు సినిమాలు చేసే ఉద్దేశ్యం ఉందా అనే సందేహం ఆయన అభిమానుల్లో నెలకొంది.
శర్వానంద్ కి తన ద్రుష్టి సినిమాల నుండి బిజినెస్ వైపు మరలిందని సోషల్ మీడియా లో గత కొద్ది రోజుల నుండి బాగా టాక్ వినిపిస్తుంది..ఏడాది రెండు మూడు సినిమాల షూటింగ్స్ తో తన క్యాలండర్ మొత్తాన్ని నింపేసుకునే అలవాటు ఉన్న శర్వానంద్ ఇప్పుడు తన లైనప్ లో కేవలం ఒకేఒక్క సినిమాని పెట్టుకున్నాడు..భవిష్యత్తులో చెయ్యబోతున్న సినిమాల గురించి కానీ తన ఆఫీస్ లో చర్చలు జరిపినట్టు దాఖలాలు కూడా లేవని శర్వానంద్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.
ఇదంతా చూస్తే ప్రస్తుతం ఒప్పుకున్న సినిమా పూర్తి అయినా తర్వాత సినిమాలకు దూరంగా వ్యాపారాలకు దగ్గరగా తన కెరీర్ ని తిప్పుకోబోతున్నట్టు తెలుస్తుంది..పెళ్లి తర్వాత ఆయన ఇదే చేయబోతున్నాడట..మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో శర్వానంద్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది..మరి మనోడు ఈ రూమర్స్ పై స్పందిస్తాడో లేదో చూడాలి.