https://oktelugu.com/

200 కోట్ల ఆస్తిని అమ్మేస్తున్న హీరో.. కారణమిదే!

కోట్లు రెమ్యూనరేషన్లు తీసుకుంటారు వారికేంటి అని హీరోల గురించి గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఆ హీరోల మెయింటనెన్స్ మనలా ఉండదు. భారీగా ఉంటుంది. ఖర్చులే తప్ప సినిమాలు లేకపోతే ఏం చేస్తారు? ఉన్న ఆస్తులు అమ్ముకొని బట్ట పొట్ట కోసం ఖర్చు చేయాల్సిందే. అందుకే ఆ హీరో ఇప్పుడు అదే చేస్తున్నాడట.. ఫిలింనగర్ లోని ఖరీదైన ఈ ప్రాంతంలో ఓ విలువైన ప్రాపర్టీ ఆ హీరోకు ఉందట.. దానిపై నెలనెలా భారీగా ఆదాయం వస్తోంది. కానీ అప్పులు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 21, 2021 / 07:00 PM IST
    Follow us on

    కోట్లు రెమ్యూనరేషన్లు తీసుకుంటారు వారికేంటి అని హీరోల గురించి గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఆ హీరోల మెయింటనెన్స్ మనలా ఉండదు. భారీగా ఉంటుంది. ఖర్చులే తప్ప సినిమాలు లేకపోతే ఏం చేస్తారు? ఉన్న ఆస్తులు అమ్ముకొని బట్ట పొట్ట కోసం ఖర్చు చేయాల్సిందే. అందుకే ఆ హీరో ఇప్పుడు అదే చేస్తున్నాడట..

    ఫిలింనగర్ లోని ఖరీదైన ఈ ప్రాంతంలో ఓ విలువైన ప్రాపర్టీ ఆ హీరోకు ఉందట.. దానిపై నెలనెలా భారీగా ఆదాయం వస్తోంది. కానీ అప్పులు కొన్ని ఇబ్బందికరంగా ఉండడం.. ఈ మధ్య సినిమాల ఆదాయం ఏడాదిన్నరగా లేకపోవడంతో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ హీరో తన ప్రాపర్టీని అమ్మి అప్పులు తీర్చి తనకు ఖర్చులు పోని ఓ కమర్షియన్ స్థలంపై తిరిగి పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాడట..

    అందుకే ఆ ఫిలింనగర్ లోని ఖరీదైన స్థలాన్ని అమ్ముతున్నట్టుగా ఇటీవలే ప్రకటించాడు. దానికి బేరం 200 కోట్ల వరకు పలుకుతోందట.. అతి త్వరలోనే దాన్ని అమ్మే మరో చోట 100 కోట్లతో పెట్టుబడి పెట్టి మిగతా అప్పులు ఇతర అవసరాలు తీర్చుకోవాలని చూస్తున్నాడట..

    ప్రస్తుతం ఈ హీరో రెండు సొంత నిర్మాణంలో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు.