Homeఎంటర్టైన్మెంట్SaiDharam Tej Accident: ఘోర  రోడ్డు ప్రమాదం: హీరో సాయిధరమ్ తేజ్ కు తీవ్రగాయాలు

SaiDharam Tej Accident: ఘోర  రోడ్డు ప్రమాదం: హీరో సాయిధరమ్ తేజ్ కు తీవ్రగాయాలు

SaiDharam Tej Accident: వినాయక చవితి రోజున మెగా హీరో తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురికావడం మెగా అభిమానుల్లో కలకలం రేపింది. చిరంజీవి మేనల్లుడు.. ప్రముఖ సినీ హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్పోర్ట్స్ బైక్ నుంచి ఆయన కిందపడ్డారు. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కు తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది. మాదాపూర్ లోని కేబుల్ బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. అనంతరం స్థానికులు, పోలీసులు ఆయనను మాదాపూర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

అయితే ప్రస్తుతం వైద్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సాయిధరమ్ తేజ్ అపస్మారక స్థితి నుంచి కోలుకున్నాడని.. మెలకువలోకి వచ్చినట్టు సమాచారం. ఆయనకు ప్రమాదం ఏమీ లేదని.. ప్రాణాపాయం లేదని తెలిసింది. సాయిధరమ్ త్వరగా కోలుకోవాలని అభిమానులతోపాటు ‘తుపాకీ.కామ్’ కోరుతున్నారు.

సినీ హీరో సాయిధరమ్ వినాయక చవితి కావడంతో స్పోర్ట్స్ బైక్ పై రైడింగ్ కు వెళ్లినట్లు తెలిసింది. ఈక్రమంలోనే తీగల బ్రిడ్జిపై ఆయన కిందపడ్డారు. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 45 నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జి దాటాక కోహినూర్ హోటల్ వద్ద సాయిధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ నుంచి ఒక్కసారిగా కిందపడ్డారు.

అక్కడ గుర్తించిన స్థానికులు, పోలీసులు సాయిధరమ్ ను వెంటనే మాదాపూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన కుడికన్ను, చాతి, పొట్ట భాగంలో తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై స్థానిక సీఐ స్పందించారు. సాయిధరమ్ కుటుంబ సభ్యులకు ప్రమాదంపై చెప్పామని.. స్కానింగ్ కోసం సాయిధరమ్ ను పంపామని తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్నట్టు తెలిసిందని సీఐ తెలిపారు.

వీడియో

హీరో సాయి ధరమ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం  |  Hero Sai Dharam Tej met Accident - TV9

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version