Amaran Movie First Review : శివ కార్తికేయన్ ‘అమరన్’ మొట్టమొదటి రివ్యూ..ఇంతటి ఎమోషనల్ క్లైమాక్స్ మీరెప్పుడు చూసుండరు!

ఈ సినిమా నుండి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతే కాదు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా తమిళనాడు తో పాటు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోనూ ఊహించిన దానికంటే ఎక్కువ జరిగింది.

Written By: Neelambaram, Updated On : October 30, 2024 9:57 pm

Amaran Movie First Review

Follow us on

Amaran Movie First Review : ప్రముఖ తమిళ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ చిత్రం ‘అమరన్’ రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. కమల్ హాసన్ ‘రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పిక్చర్స్’, సోనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రాజ్ కుమార్ పెరియసామీ దర్శకత్వం వహించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతే కాదు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా తమిళనాడు తో పాటు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోనూ ఊహించిన దానికంటే ఎక్కువ జరిగింది.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమాకి 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రీసెంట్ గా విడుదలై సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వెట్టియాన్’ చిత్రానికి కూడా తెలుగు వెర్షన్ లో ఈ స్థాయి ఓపెనింగ్ రాలేదు. అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రెండు భాషలకు కలిపి 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు మొదటి రోజు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోస్ పలు ప్రాంతాలలో ప్రదర్శించారు. ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి ఈ షార్ట్ రివ్యూ లో చూద్దాం. సినిమా ఆరంభం కాస్త స్లో గానే ఉంటుందట. హీరో కుటుంబ నేపథ్యం, అతని లవ్ స్టోరీ ని చూపిస్తారు. ఎప్పుడైతే హీరో బోర్డర్ కి వేళ్తాడో, అప్పటి నుండి స్క్రీన్ ప్లే ఉత్కంఠ భరితంగా సాగుతుందట. హీరో శివ కార్తికేయన్ ముకుంద్ వరదరాజన్ క్యారక్టర్ లో జీవించేసాడని, ఇది ఆయన కెరీర్ లోనే బెస్ట్ రోల్ అని చూసిన ప్రతీ ఒక్కరు చెప్తున్నారు. సెకండ్ హాఫ్ కూడా అదే ఇంటెన్సిటీ తో స్క్రీన్ ప్లే కొనసాగుతుంది.

ఇక ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు డైరెక్టర్ టేకింగ్ కి సెల్యూట్ చేయాల్సిందే. అంత ఎమోషనల్ గా, గుండెల్ని పిండేసే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడట డైరెక్టర్ రాజ్ కుమార్. ఇటీవల కాలంలో ఇలాంటి బయోపిక్ రాలేదని, బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం వండర్స్ ని సృష్టిస్తుందని, తమిళనాడు లో ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన అన్ని చిత్రాల వసూళ్లను అధిగమించేస్తుందని చూసిన ప్రతీ ఒక్కరు చెప్తున్నారు. మరి రేపు పబ్లిక్ నుండి కూడా ఇదే టాక్ వస్తుందో లేదో చూడాలి. శివ కార్తికేయన్ ఇప్పటికే తెలుగు లో ‘డాక్టర్’, ‘డాన్’ వంటి విజయవంతమైన సినిమాలతో మన ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. ఈ సినిమా హిట్ అయితే ఆయనకీ తెలుగులో కూడా స్థిరమైన మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంది.