Homeఎంటర్టైన్మెంట్Hero Movie: గల్లా అశోక్ " హీరో " సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేసిన......

Hero Movie: గల్లా అశోక్ ” హీరో ” సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేసిన… రానా

Hero Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు… గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ” హీరో ”. ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా… హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల మహేష్ బాబు చేతుల మీదుగా… ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ లను విడుదల చేయగా… వాటిని మంచి స్పందన లభిస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్ర బృందం ప్రేక్షకులకు ఓ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది.

hero rana launches song from galla ashok hero movie

హీరో సినిమా నుంచి ” అచ్చ తెలుగందమే ” అనే పాటను హీరో దగ్గుబాటి రానా విడుదల చేశారు. ఈ పాటకు జిబ్రాన్ సంగీతంగా అందించగా… సిడ్ శ్రీరామ్ మరోసారి తన గాత్రంతో మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. ” నింగిలో తారక నేలపై వాలెనే… కన్నుల పండగై కాలమే ఆగెనే ” అంటూ సాగిన ఈ పాట ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా ఈ సాంగ్ లో అశోక్, నిధి అగర్వాల్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందని చెప్పాలి. ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్న మూడోతరం హీరో కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

https://twitter.com/RanaDaggubati/status/1452496393688346627?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1452496393688346627%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fhero-movie-song-rana-daggubati-launched-acha-telugandame-song-from-ashok-galla-movie-hero-8320

సూపర్ స్టార్ కృష్ణ – గల్లా అరుణకుమారి సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని… అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. అలానే ఈ మూవీలో జగపతిబాబు, నరేష్, కౌశల్య, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని నిర్మాతలు చెబుతున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version