ఎనర్జిటిక్ స్టార్ గా రామ్ పోతినేనికి మంచి క్రేజ్ ఉంది. అయితే, నిత్యం జిమ్ లో భారీ వర్కౌట్స్ చేస్తూ తనను తాను ఎప్పటికప్పుడు సరికొత్తగా మార్చుకుంటూ పోతున్న రామ్ కి, ఇప్పుడు ఆ పెర్ఫెక్షనే బాధ పెట్టింది. రామ్, ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ కోసం రామ్ సిక్స్ ప్యాక్ బాడీ చూపించాలి. దాంతో.. ఈ మధ్య ఎక్కువ సమయాన్ని రామ్ జిమ్ లోనే గడిపేస్తున్నాడు. రిస్క్ తో కూడుకున్న వర్కౌట్స్ చేస్తున్నాడు.

ఈ క్రమంలో రామ్ పోతినేని గాయాలపాలయ్యాడు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తోన్న క్రమంలోనే రామ్ మెడకు భారీ గాయమైంది. ఇక తనకు జరిగిన ప్రమాదం గురించి, అయిన గాయం గురించి రామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ గాయాన్ని చూపిస్తూ ఒక ఫోటో కూడా పెట్టాడు. ఇక ‘రామ్ త్వరగా కోలుకోవాలి..గెట్ వెల్ సూన్’ అంటూ రామ్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు.
అన్నట్టు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ చేస్తోన్న సినిమా ఓ పాన్ ఇండియా సినిమా. అందుకే రామ్ ఈ సినిమా కోసం మొదటి నుంచి బాగా కష్టపడుతున్నాడు. కెరీర్ లో మొదటిసారి చేస్తోన్న పాన్ ఇండియా సినిమా కాబట్టి.. తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం జిమ్ లో వ్యాయామం చేస్తూ గడుపుతున్నాడు. కానీ రామ్ మెడకు గాయం కావడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు.
ఇక ఈ సినిమా పూర్తి చేసిన వెంటనే.. బోయపాటి తో సినిమాని సెట్ చేసే పనిలో ఉన్నాడు రామ్, రామ్ కి ఎప్పటి నుంచో మాస్ హీరోగా ప్రమోట్ అవ్వాలని ఆశ ఉంది. అందుకే, బోయపాటితో సినిమా చేయడానికి రామ్ ఆసక్తిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే బోయపాటి రామ్ కి ఒక కథ చెప్పాడు. కథ రామ్ కి బాగా నచ్చింది. మొత్తానికి వీరిద్దరి కలయికలో సినిమా ఓకే అయింది.
మరి యాక్షన్ హీరోగా ప్రమోట్ అవ్వాలని ఆశ పడుతున్న రామ్ కోరిక తీరుతుందా ? చూడాలి. నిజానికి రామ్ కి స్టార్ హీరో అయ్యే అన్ని ఫీచర్స్ ఉన్నాయి. కానీ, రామ్ మాత్రం ఇంకా ఏవరేజ్ హీరో స్థాయికే పరిమితం కావాల్సి వచ్చింది.