Sridevi Drama Company: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈటీవీ లో సుధీర్ వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతివారం సరికొత్త కాన్సెప్ట్ లతో ఎంతో మంది ప్రేక్షకులను సందడి చేస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన తాజా ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో లో తెలుగు చలన చిత్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి పుట్టిన రోజు ఘనం గా సెలెబ్రేట్ చేశారు.

ఈ నేపథ్యం లో ఒక టికెట్టు పై నాలుగు సినిమాలు చూపిస్తా అంటూ వస్తున్నాడు ఆటో రామ్ ప్రసాద్ అని సుధీర్ చెప్పగా అందరూ ఆశ్చర్య పోతారు. అప్పట్లో టాలీవుడ్ హిట్స్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన మగధీర, ఛత్రపతి, యమదొంగ, విక్రమార్కుడు సినిమాలని ఒక స్కిట్ రూపం లో ప్రదర్శించి జక్కన్న కి ట్రిబ్యూట్ ఇస్తాడు ఆటో రామ్ ప్రసాద్. అంతే కాకుండా దీపు, సింగర్ గీత మాధురి జక్కన్న మూవీ లోని హిట్స్ ని పాడుతూ స్టేజ్ ని ఉర్రుతలూగిస్తారు.
ఇదంతా ఒక వైపు అయితే మరోవైపు ఈ మధ్య యూట్యూబ్ పెయిర్ గా నిలిచి మంచి ఫార్మ్ ని కొనసాగిస్తున్న జబర్దస్త్ వర్ష,ఇమ్మాన్యూల్ పర్ఫార్మెన్సు షో మొత్తానికే అద్భుతంగా నిలిచింది. ప్రేమిస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, ఒకవేళ ఒప్పుకోకపోతే వేరే పెళ్లి చేసుకోవాలి అంతే కానీ ఆత్మహత్య మాత్రం చేసుకోకూడదు అని అద్భుతమైన మెసేజ్ ఇస్తూ ప్రోమో ని ముగిస్తారు.