Rajasekhar Daughters: హీరోల కొడుకులు హీరోలవడం సర్వసాధారణం కానీ హీరోల కూతుళ్లు హీరోయిన్లవడం ఒక అప్పుడు అరుదే. కాని ప్రస్తుతం కాలంలో కొడుకులతో పాటు కూతుర్లు కూడా సినిమా వారసత్వం అందుకుంటున్నారు. వారిలో మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక, మంచు ఫ్యామిలీ నుంచి మంచు లక్ష్మీ అలానే ఇటివలే రాజశేఖర్ కూతుళ్లు కూడా నటన వైపే అడుగులు వేశారు.
టాలీవుడ్ లో రాజశేఖర్ కూతుళ్లు శివాత్మిక,శివాని నటించిన సినిమాలు అంతగానే ఉన్నాయని చెప్పాలి.సిని కెరీర్ పరంగా టాలీవుడ్ లో వీరికి అంత క్రేజ్ లేదు. ఇదిలా ఉంటే తమిళనాట వరస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు ఈ అక్కచెల్లెళ్ళు. వీళ్లిద్దరికీ తమిళంలో అవకాశాలు రావడం విశేషం వీళ్లిద్దరూ నటించిన చిత్రాలు రెండు వారాల వ్యవధిలో తమిళనాట విడుదల కానున్నాయి.

శివాత్మిక తమిళంలో కథానాయికగా పరిచయం కానున్న ‘ఆనందం విలయాడుం వీడు’ ఈ నెల 24న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమా లో కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ హీరోగా గ్రామీణ వాతావరణంలో నడిచే అరవ మార్కు మాస్ మూవీ. ఇందులో శివాత్మిక పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
మరోవైపు శివాని తమిళంలో ‘అన్బరివు’ అనే సినిమాతో తమిళనాట ఎంట్రీ ఇస్తోంది. ఇందులో సంగీత దర్శకుడు,హీరో హిప్ హాప్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.. శివాని మోడర్న్ అమ్మాయిగా పొట్టి డ్రెస్సుల్లో హాట్ లుక్స్ తో కనిపిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న హాట్ స్టార్ ద్వారా రిలీజవుతోంది. శివాని మూడో చిత్రం కూడా ఓటీటీ బాటే పట్టడం విశేషంగా చెప్పుకోవాలి.ఈ అక్కచెల్లెళ్ళు తమిళనాటనా స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకు ఉంటారో లేదో చూడాలి.