https://oktelugu.com/

Hero Raj Tarun: హీరో లక్ రివర్స్ అయ్యింది.. ఇక సైడ్ క్యారెక్టర్సే దిక్కు !

Hero Raj Tarun: ‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్తా మావ’, ‘కుమారి 21F’ చిత్రాలతో సంచలనం సృష్టించిన రాజ్ తరుణ్ రీసెంట్ గా రేసులో లేకుండా పోయాడు. గత దశాబ్ద కాలంలో ఒక్క హిట్ కూడా లేదు. మొన్నటి వరకు చిన్నదో, పెద్దదో అనుకుంటూ హీరోగా కనిపిస్తూ ఏదొక సినిమా చేస్తూ వచ్చిన ఈ హీరో మొత్తానికి హీరోయిజాన్ని వదిలేశాడు. తనకు తన మేటర్ అర్థం అయింది. అందుకే.. సైడ్ రోల్స్ లోకి వచ్చాడట. రవితేజ – […]

Written By:
  • Shiva
  • , Updated On : March 12, 2022 / 06:44 PM IST
    Follow us on

    Hero Raj Tarun: ‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్తా మావ’, ‘కుమారి 21F’ చిత్రాలతో సంచలనం సృష్టించిన రాజ్ తరుణ్ రీసెంట్ గా రేసులో లేకుండా పోయాడు. గత దశాబ్ద కాలంలో ఒక్క హిట్ కూడా లేదు. మొన్నటి వరకు చిన్నదో, పెద్దదో అనుకుంటూ హీరోగా కనిపిస్తూ ఏదొక సినిమా చేస్తూ వచ్చిన ఈ హీరో మొత్తానికి హీరోయిజాన్ని వదిలేశాడు. తనకు తన మేటర్ అర్థం అయింది. అందుకే.. సైడ్ రోల్స్ లోకి వచ్చాడట.

    Hero Raj Tarun

    రవితేజ – నక్కిన సినిమాలో ఇప్పటికే ఓ కీలక పాత్రలో నటిస్తున్న రాజ్ తరుణ్.. తాజాగా మరో సినిమా కూడా ఒప్పుకున్నాడట. సందీప్ కిషన్ హీరోగా రూపొందుతోన్న ‘మైఖేల్’ అనే చిత్రంలో ఒక కీలకమైన పాత్రని పోషించనున్నాడు రాజ్ తరుణ్. అన్నట్టు ఈ సినిమాలో రాజ్ తరుణ్ తో పాటు వరుణ్ సందేశ్‌ కూడా నటిస్తున్నాడు. తమిళ్ హీరో విజయ్ సేతుపతి కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తుండే సరికి… ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

    Also Read: సినీ స్టార్స్ నేటి క్రేజీ పోస్ట్ లు !

    అయితే, తాజాగా ఈ సినిమాలోకి వరుణ్ సందేశ్ తో పాటు రాజ్ తరుణ్ కూడా వచ్చి చేరాడు. మైఖేల్ చిత్రం షూటింగ్ తాజా షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్‌ లో స్టార్ట్ అయ్యింది. ఈ షూటింగ్ లో రాజ్ తరుణ్ కూడా జాయిన్ అయ్యాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తమ్మీద రాజ్ తరుణ్ సరైన నిర్ణయం తీసుకున్నాడు.

    హీరోగానే కంటిన్యూ అవడం కన్నా ఎదో ఒక పాత్రలో కనిపించడమే బెటర్ అని ఇలా సైడ్ పాత్రల్లో నటించాలనుకోవడం మంచి పరిణామమే. ఎలాగూ.. వరుణ్ సందేశ్ కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఫేడ్ అవుట్ హీరోలకు ఇలా మంచి సినిమాలే వస్తున్నాయి. కాకపోతే చిన్నాచితకా పాత్రలు అనుకోండి. నిజానికి నాలుగేళ్ల క్రితం ‘రాజ్ తరుణ్’కి నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చి మరీ, వరుసగా సినిమాలు చేయమని అతన్ని బుక్ చేసుకునేవాళ్ళు.

    Hero Raj Tarun

    పైగా అప్పట్లో రాజ్ తరుణ్ కి ఒక డైరెక్టర్ వెళ్లి కథ చెప్పడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. అంతగా రాజ్ తరుణ్ కి అప్పుడు డిమాండ్ ఉండేది. ఎంతైనా ‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్తా మావ’, ‘కుమారి 21F’ లాంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు కాబట్టి, సడెన్ గా లైం లైట్ లోకి వచ్చిన ఈ కుర్రాడి పై అప్పుడు బాగానే ఆసక్తి చూపించేవారు దర్శకనిర్మాతలు. అయితే అదృష్టం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. మనోడు లక్ రివర్స్ అయ్యింది.

    Also Read:  సినిమా రిలీజై 15 రోజులు కాలేదు.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోందా ?

    Tags