Homeఎంటర్టైన్మెంట్Prabhas: అభిమాని ప్రేమకు మురిసిపోయిన ప్రభాస్​.. ఖరీదైన గిఫ్ట్​తో సర్​ప్రైజ్​!

Prabhas: అభిమాని ప్రేమకు మురిసిపోయిన ప్రభాస్​.. ఖరీదైన గిఫ్ట్​తో సర్​ప్రైజ్​!

Prabhas: రెబల్​స్టార్​ ప్రభాస్​కు ఉన్న ఫ్యాన్​ ఫాలోయింగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయను అభిమానులు ఉన్నారు. బాహుబలి సినిమాతో ఓ రేంజ్​ స్టార్​డమ్​ను సొంతం చేసుకున్న ప్రభాస్​.. ఇప్పుడు వరుసగా పాన్​ఇండియా సినిమాలతో దూసుకెళ్లిపోతున్నారు. కాగా,  కొంతమంది అభిమానం హీరోలనే ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ అభిమాని ప్రభాస్​ను ఆశ్చర్యపరిచేలా తన అభిమానాన్ని చాటుకున్నాడు. తలపై ప్రభాస్​ అనే అక్షరాలతో హెయిర్​స్టైల్​చేయించుకుని ప్రభాస్​కు చూపించారు. అతని అభిమానాన్ని చూసి ముచ్చటపడిపోయిన ప్రభాస్​.. అతనితో కాసేపు ముచ్చటించారు.

prabhas

అనంతరం తన వీరాభిమానికి ఖరీదైన వాచ్​ను బహుమతిగా ఇచ్చారు. ఫాజిల్​ కంపెనీకి చెందిన ఈ వాచ్ ఎంతో ఖరీదైనది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్​మీడియాలో వైరల్​ అవుతున్నాయి. అయితే, ఇలా తనపై ప్రేమ కురిపించిన అభిమానులకు గిఫ్ట్స్​ ఇవ్వడం ఇది కొత్తేం కాదు. గతంలోనూ అనేకమందికి ఇలానే బహుమతులు ఇచ్చి సర్​ప్రైజ్​ చేశారు.

మరోవైపు, రాధేశ్యామ్​ సినిమాతో ఫుల్​ బిజీగా ఉన్నారు ప్రభాస్​. పీరియాడికల్​ లవ్​స్టోరీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పూజా హెగ్డె హీరోయిన్​గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమాలోని ఈ రాతలే పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మరోవైపు, ఆదిపురుష్​ సినిమా షూటింగ్​ కూడా కంప్లీట్​ చేసుకున్నారు ప్రభాస్​. ఓం రౌంత్​ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కృతి సనన్ ఈ సినిమాలో సీత పాత్ర పోషించింది. సైఫ్​ అలిఖాన్​ రావణుడిగా కనిపించనున్నారు. దీంతో పాటు సలార్ సినిమాలోనూ నటిస్తున్నారు ప్రభాస్​.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular