https://oktelugu.com/

Nithin: జూనియర్ ఆర్టిస్ట్ గా హీరో నితిన్… ఇదే ట్విస్ట్ సామీ!

2018లో నాపేరు సూర్య విడుదల కాగా... ఐదేళ్లకు మరలా మెగా ఫోన్ పట్టాడు. నితిన్ హీరోగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ చేస్తున్నాడు. ఎక్స్ట్రా ఆర్డినరీ మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు. డిసెంబర్ 8న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2023 5:26 pm
    Nithin

    Nithin

    Follow us on

    Nithin: నితిన్ కి వెంటనే ఓ హిట్ కావాలి. భీష్మ అనంతరం నితిన్ సక్సెస్ చూడలేదు. అంచనాల మధ్య విడుదలైన పలు చిత్రాలు ఫలితం ఇవ్వలేదు. హిందీ హిట్ మూవీ అంధాదున్ రీమేక్ మ్యాస్ట్రో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. మ్యాస్ట్రో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా నితిన్ కి ఉపయోగపడలేదు. ఈ క్రమంలో నితిన్ రచయిత వక్కంతం వంశీకి ఛాన్స్ ఇచ్చారు. రచయితగా పలు హిట్స్ ఇచ్చిన వక్కంతం వంశీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన నా పేరు సూర్య డిజాస్టర్ అయ్యింది.

    2018లో నాపేరు సూర్య విడుదల కాగా… ఐదేళ్లకు మరలా మెగా ఫోన్ పట్టాడు. నితిన్ హీరోగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ చేస్తున్నాడు. ఎక్స్ట్రా ఆర్డినరీ మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు. డిసెంబర్ 8న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వక్కంతం వంశీ, నటుడు రావు రమేష్, నితిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్కంతం వంశీ స్క్రిప్ట్ ఓకే చేయడానికి మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం ఏమిటని యాంకర్ అడిగారు.

    ఈ సినిమాలో నేను జూనియర్ ఆర్టిస్ట్ రోల్ గా కనిపిస్తాను. ఆ ఒక్క పాయింట్ నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. గతంలో ఎవరూ ఇలాంటి పాత్ర ట్రై చేయలేదు. అందుకే టక్కున ఒప్పేసుకున్నాను. నా 20 ఏళ్ల కెరీర్లో ఇది బెస్ట్ రోల్ అనడంలో సందేహం లేదని నితిన్ చెప్పుకొచ్చాడు. హీరో జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తే ఎలా ఉంటుంది. ఆ పాత్రను వక్కంతం వంశీ ఎలా తీర్చిదిద్దాడనే ఆసక్తి నెలకొంది. నితిన్ కి ఈ సినిమా విజయం కావడం చాలా అవసరం.

    అలాగే వక్కంతం వంశీకి కూడా. ఈసారి ఆయన దర్శకుడిగా ఫెయిల్ అయితే మరో ఛాన్స్ రావడం కష్టమే. ఇక రచయితగానే ఆయన సెటిల్ కావాల్సి వస్తుంది. ఈ మూవీలో హీరో రాజశేఖర్ క్యారెక్టర్ రోల్ చేయడం మరో విశేషం. కెరీర్లో మొదటిసారి రాజశేఖర్ క్యారెక్టర్ రోల్ చేస్తున్నారు. నితిన్ కి జంటగా శ్రీలీల నటిస్తుంది. ఎక్స్ట్రా ఆర్డినరీ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.