Mansoor Ali Khan: మన్సూర్ అలీ ఖాన్-త్రిష వివాదంలో కొత్త ట్విస్ట్

మన్సూర్ కామెంట్స్ ని పలువురు ఖండించారు. త్రిష ఘాటుగా స్పందించింది. ఇంతటి జుగుప్సా కరమైన మాటలు మాట్లాడిన వ్యక్తితో ఇంత వరకు నేను కలిసి నటించలేదు. అందుకు సంతోషిస్తున్నాను.

Written By: NARESH, Updated On : November 24, 2023 5:30 pm

Mansoor Ali Khan

Follow us on

Mansoor Ali Khan: సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ హీరోయిన్ త్రిషను ఉద్దేశించి చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. లియో మూవీలో త్రిష హీరోయిన్ గా నటించింది. మన్సూర్ అలీ ఖాన్ ఓ కీలక పాత్ర చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… లియో మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుందని నాకు తెలిసింది. ఆమెతో నాకు రేప్ సీన్ ఉంటుంది. ఆమెను బెడ్ రూమ్ కి తీసుకెళతాను అనుకున్నాను. కానీ కాశ్మీర్ లో లియో సెట్స్ లో నాకు త్రిషను చూపించనేలేదు అన్నాడు. త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఆశిస్తే ఆమెతో నాకు కనీసం కాంబినేషన్ సీన్ లేదన్న అర్థంలో అతడు మాట్లాడాడు.

మన్సూర్ కామెంట్స్ ని పలువురు ఖండించారు. త్రిష ఘాటుగా స్పందించింది. ఇంతటి జుగుప్సా కరమైన మాటలు మాట్లాడిన వ్యక్తితో ఇంత వరకు నేను కలిసి నటించలేదు. అందుకు సంతోషిస్తున్నాను. ఇకపై నటించబోను. మన్సూర్ అలీ ఖాన్ లాంటి వాళ్ళు మానవ జాతికే కళంకం, అని త్రిష ట్వీట్ చేసింది. మన్సూర్ అలీ ఖాన్ పై నడిగర్ సంఘం చర్యలు తీసుకుంది. తాత్కాలిక నిషేధం విధించింది. త్రిషకు మన్సూర్ క్షమాపణలు చెప్పాలని నడిగర్ సంఘం హెచ్చరించింది.

కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా నడిగర్ సంగం చర్యలు తీసుకోవడం ఏమిటీ. నేను నా మాటలకు కట్టుబడే ఉన్నాను. నేను తప్పు మాట్లాడలేదు. త్రిషకు క్షమాపణలు చెప్పేది లేదు. నడిగర్ సంఘానికి నేనే టైం ఇస్తున్నాను. నాలుగు గంటల్లో నాపై ఉన్న నిషేధం ఎత్తేయాలని ప్రెస్ మీట్లో హెచ్చరికలు జారీ చేశాడు. అయితే ఎట్టకేలకు మన్సూర్ అలీ ఖాన్ తగ్గాడు. క్షమాపణలు చెప్పాడు.

మీడియా ముందుకు వచ్చిన మన్సూర్ అలీ ఖాన్… కొద్ది రోజులుగా నేను కత్తి లేకుండా, రక్తం చిందకుండా యుద్ధం చేస్తున్నాను. ఈ యుద్ధంలో నేనే గెలిచాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను చేసిన కామెంట్స్ త్రిషను బాధపెట్టాయి. అందుకు ఆమెకు క్షమాపణలు చెబుతున్నాను. ఈ కళింగ యుద్ధం ఇంతటితో ముగిసింది… అని మన్సూర్ అన్నారు. మన్సూర్ క్షమాపణలు కోరిన నేపథ్యంలో నడిగర్ సంఘం నిషేధం ఎత్తివేసినట్లు తెలుస్తుంది.

మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో త్రిష ట్వీట్ చేశారు. మన్సూర్ పేరు ప్రస్తావించకుండా అతని క్షమాపణలు అంగీకరిస్తున్నట్లు కామెంట్ చేసింది. తప్పు చేయడం మానవ సహజం, క్షమించడం గొప్ప విషయం అంటూ ఆమె ట్వీట్ చేశారు. త్రిష ట్వీట్ వైరల్ అవుతుంది. దీంతో మన్సూర్ అలీ ఖాన్, త్రిష వివాదానికి తెర పడినట్లు అయ్యింది. లియో దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూడా మన్సూర్ కామెంట్స్ ని ఖండించారు. లియో చిత్రంలో త్రిష హీరో విజయ్ భార్య రోల్ చేసింది.

Tags