Hero Naveen Polishetty's movie finalized under Mani Ratnam's direction
Naveen Polishetty : మణిరత్నం(Maniratnam) లాంటి లెజెండ్ తో కలిసి పనిచేయాలని ప్రతీ సూపర్ స్టార్ కనే కల. హిట్టైన, ఫ్లాప్ అయినా పర్వాలేదు, కేవలం ఆయన దర్శకత్వంలో నటిస్తే చాలు అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆయన సినిమాలో నటిస్తే, నటనలో కొత్త మెళుకువలు నేర్చుకోవచ్చు అనేది సూపర్ స్టార్స్ ఆలోచన. ఆయన ఫ్లాప్ ఫేస్ లో ఉన్నప్పుడు కూడా సూపర్ స్టార్స్ ఆయన్ని ఒక నెంబర్ 1 డైరెక్టర్ గానే చూసేవారు. రీసెంట్ గా ఆయన పొన్నియన్ సెల్వన్ సిరీస్ తో ఎలాంటి సెన్సేషన్ ని సృష్టించాడో మనమంతా చూసాము. తమిళ సినిమా ఇండస్ట్రీ మేకింగ్ పరంగా ఇప్పటికీ ఈ చిత్రాన్ని చూపిస్తూ గర్వంగా చెప్పుకుంటారు. ఎంతో లోతైన సబ్జెక్టు ని ఎలా తీయాలో నాకు అర్థంకాక, ఆ సినిమాని తీసే ఆలోచననే పక్కన పెట్టేసాను, అలాంటిది మణిరత్నం కేవలం రెండు భాగాలతో ఇంత పెద్ద సబ్జెక్టు ని ఎలా చెప్పగలిగాడో నాకు అర్థం కాలేదంటూ రాజమౌళి లాంటి డైరెక్టర్స్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు.
ప్రస్తుతం ఆయన కమల్ హాసన్(Kamal Hassan) తో కలిసి ‘థగ్ లైఫ్’ అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత తనకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టిన లవ్ స్టోరీ జానర్ లో ఒక సినిమా చేయబోతున్నాను అని మణిరత్నం ఇది వరకే అధికారిక ప్రకటన చేశాడు. ఆ సినిమాలో నలుగురు హీరోలుంటారట. అందులో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) ని మెయిన్ హీరో గా తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన మూడు పాత్రలకు ఏ హీరోలను ఎంచుకోబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా తెలియచేయనున్నారు. అయితే చేసిన మూడు నాలుగు సినిమాలకే మణిరత్నం దృష్టిలో పడే రేంజ్ కి నవీన్ పోలిశెట్టి ఎదిగాడు అనేది సాధారణమైన విషయం కాదు.
ఒక యాంకర్ గా కెరీర్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత సినిమాల్లో కీలక పాత్రలు పోషించుకుంటూ మంచి గుర్తింపుని తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమాలో ఆయన పండించిన కామెడీ, పుట్టించిన ఎమోషన్ ని చూసి మోడరన్ మెగాస్టార్ చిరంజీవి అంటూ పొగడడం మొదలెట్టారు ఆడియన్స్. ఇక ఆ తర్వాత వచ్చిన ‘జాతి రత్నాలు’, ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. కేవలం నవీన్ పోలిశెట్టి నటన వల్లే ఈ సినిమాలు అంత పెద్ద హిట్ అయ్యాయి. అంతటి పొటెన్షియల్ ని గమనించిన మణిరత్నం నవీన్ పోలిశెట్టి తో సినిమా చేయాలని బలంగా ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాలో నవీన్ తన టాలెంట్ ని చూపిస్తే ఎవ్వరూ అందుకోలేనంత రేంజ్ కి వెళ్ళిపోతాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.