https://oktelugu.com/

Hero Nani: కొత్త క్యారెక్టర్ తో రానున్న నాని.. మెప్పిస్తాడా?

నాని నటించే కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ లను సొంతం చేసుకుంటే..మరికొన్ని ఆవరేజ్ ఫలితాలను సొంతం చేసుకుంటాయి. కానీ ఫ్లాప్ అవడం చాలా తక్కువే అని చెప్పాలి.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 11, 2024 / 03:14 PM IST

    Hero Nani

    Follow us on

    Hero Nani: నాని.. ఈ పేరు వింటేనే కూల్, నార్మల్, సింపుల్ అనే పదాలు గుర్తుకు వస్తాయి. నటన, అందంతో ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ముద్ర వేసుకున్నారు. ఈయన సినిమాలు ఎక్కువగా హిట్ లను సొంతం చేసుకుంటాయి. ఇక రీసెంట్ గా దసరా, హాయ్ నాన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాచురల్ స్టార్ నాని. ఈ రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ ను అందుకున్నాయి. ఈ రెండు సినిమాల హిట్ ల వల్ల ఇండస్ట్రీలో నాని పేరు మారుమోగుతుంది. ఈయన నటనలోనే కాదు అందంతో కూడా ఫిదా చేస్తుంటారు.

    నాని నటించే కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ లను సొంతం చేసుకుంటే..మరికొన్ని ఆవరేజ్ ఫలితాలను సొంతం చేసుకుంటాయి. కానీ ఫ్లాప్ అవడం చాలా తక్కువే అని చెప్పాలి. దీంతో దర్శక నిర్మాతలు నాని వెంటపడుతున్నారు. ఈయన వారి సినిమాలను ఒకే చేస్తారని వెయిట్ చేస్తున్నారు. అయితే నాని కూడా ఆచితూచి అడుగులు వేస్తూ.. మంచి సినిమాలకు మాత్రమే సైన్ చేయాలనుకుంటున్నారట. ఇదిలా ఉంటే నాని బలగం డైరెక్టర్ వేణు తో ఒక సినిమా అయ్యారు. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

    మరో కొత్త డైరెక్టర్ కూడా నానికి కథ చెప్పారట. ఈ కథ నచ్చడంతో ఆయనతో కూడా సినిమా చేయాలనుకుంటున్నారట నాని. ఇందులో ఆర్మీ బేస్డ్ స్టోరీ ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ కొత్త క్యారెక్టర్ తో నాని ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాలి. ఇప్పటికీ కూడా నాని జవాన్ గా ఒక సినిమాలో కూడా నటించలేదు. దీంతో కొత్త క్యారెక్టర్ తో నాని అదరగొడుతారనే టాక్ ఉంది. అయితే ఒకసారి కూడా ఈ క్యారెక్టర్ లో నటించని నాని జవాన్ గా ఎలా మెప్పిస్తారో అని ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. మరి చూడాలి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టాట్ అవుతుందో.. సినిమా ఎలా ఉంటుందో అని..