https://oktelugu.com/

Atrocious: ఏపీలో దారుణం.. అత్యాచారం చేసి ఆపై..

గూడెం కొత్త వీధి మండలంలోని మారుమూల గ్రామంలో ఓ కుటుంబం నివాసముంటుంది. ఈనెల 2న తల్లిదండ్రులు ఇద్దరూ పొలం పనులకు వెళ్లడంతో.. బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది.

Written By:
  • Dharma
  • , Updated On : January 11, 2024 / 03:21 PM IST

    Atrocious

    Follow us on

    Atrocious: మహిళల రక్షణకు ఎన్ని రకాల చట్టాలు తెచ్చినా ఫలితం లేకపోతోంది. రాష్ట్రంలో ఏదో ఒక చోట మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇటువంటి ఘటనే అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగు చూసింది. ఓ గిరిజన బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా.. దారుణంగా హత్య చేశారు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

    గూడెం కొత్త వీధి మండలంలోని మారుమూల గ్రామంలో ఓ కుటుంబం నివాసముంటుంది. ఈనెల 2న తల్లిదండ్రులు ఇద్దరూ పొలం పనులకు వెళ్లడంతో.. బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది. ఆ సమయంలో ఆటో డ్రైవర్ పాంగి రమేష్ ఇంట్లో ప్రవేశించి లైంగిక దాడి చేశాడు. దీంతో బాధిత బాలిక బంధువుకు ఈ విషయం చెప్పింది. బయటకు తెలిసిపోతుందన్న భయంతో రమేష్ భయపడ్డాడు. తన స్నేహితుడైన మరో ఆటోడ్రైవర్ సీతన్నకు జరిగిందంతా చెప్పాడు. బాలిక తల్లిదండ్రులు ఇంటికి వచ్చేలోగా ఆమెను చంపేద్దామని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.

    తొలుత రమేష్, తరువాత సీతన్న ఇంట్లోకి ప్రవేశించారు. ఎలాగూ చంపేస్తున్నాం కదా.. అని ఇద్దరు కలిసి మరోసారి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం చీరతో గొంతుకు ముడివేసి హత్య చేశారు. దూలానికి వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. సాయంత్రం ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఆ మరుసటి రోజు అంత్యక్రియలు జరిపారు. అప్పుడు మృతదేహానికి స్నానం చేయిస్తుండగా శరీరంపై గాయాలు కనిపించాయి. కానీ అవేవీ పట్టించుకోకుండా ఖననం చేశారు.

    అయితే రమేష్ బాలిక ఇంట్లో ప్రవేశిస్తుండగా చిన్నారులు కొంతమంది చూశారు. లైంగిక దాడి చేసినట్లు బంధువు కూడా చెప్పడంతో.. తల్లిదండ్రులు ఈనెల 5న గూడెం కొత్త వీధి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం పూర్తి చేశారు. ఇంతలో తమ పేర్లు బయటకు వస్తాయని భావించిన నిందితులిద్దరూ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు. నిందితులపై పోక్సోతో పాటు అత్యాచారం, హత్య కేసులు నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు.