Hero nani: అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన నాని, హీరో అయ్యాడు. అష్టా చెమ్మా మూవీతో వెండితెరకు పరిచయమయ్యాడు. అలా మొదలైన నాని కెరీర్ సక్సెస్ ఫుల్ హీరో స్థాయికి చేరింది. నాని గత చిత్రం శ్యామ్ సింగరాయ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పీరియాడిక్ అండ్ ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ ప్రేక్షకులను అలరించింది. ఇక నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి. జూన్ 10న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ విరివిగా నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో నాని ప్రేమ, పెళ్లి వంటి వ్యక్తిగత విషయాల పై స్పందించారు. తన జీవితంలోకి అంజనా ఎలా వచ్చారో వివరించారు. నాని-అంజనాలది ప్రేమ వివాహం అయినప్పటికీ ఇంటర్ క్యాస్ట్ కాదట. ఇక వీరి ప్రేమ ఫేస్ బుక్ ద్వారా మొదలైందట. వీరి కుటుంబ నేపధ్యాలు మాత్రం భిన్నం. అంజలి వాళ్ళది సైంటిస్ట్స్ ఫ్యామిలీ. పెళ్లి నాటికి హీరోగా నాని స్ట్రగుల్ అవుతున్నారు. నాని హీరోగా నిలదొక్కుకోగలడా? లేదా? అనే సందేహంతో అమ్మాయిని ఇవ్వాలా వద్దా? అనుకున్నారట. ఒకరకంగా చెప్పాలంటే నానితో వివాహానికి అంజలి పేరెంట్స్ భయపడ్డారట.
Also Read: Hyper Aadi Arrested: హైపర్ ఆది అరెస్ట్… షో జరుగుతుండగానే లాక్కెళ్లిన పోలీసులు!
అయితే తనని కలిసి మాట్లాడిన తర్వాత వాళ్ళకు నమ్మకం ఏర్పడిందట. అప్పుడు అంజలితో వివాహానికి ఒప్పుకున్నారట. 27 అక్టోబర్ 2012లో నాని-అంజలి వివాహం జరిగింది. వీరికి అర్జున్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. వాల్ పోస్టర్ పేరుతో నాని ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ లో తెరకెక్కే చిత్రాలకు సంబంధించిన వ్యవహారాలు అంజలి చూసుకుంటారని సమాచారం. ఆమెకు సపరేట్ ప్రొఫెషన్ ఉంది.

ఇక దర్శకుడు వివేక్ ఆత్రేయ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా అంటే సుందరానికి చిత్రం తెరకెక్కించారు. నానికి జంటగా మలయాళ హీరోయిన్ నజ్రియా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచేశాయి.
Also Read: Vikram OTT Update: విక్రమ్ OTT రిలీజ్ డేట్ వచ్చేసింది
[…] Also Read: Hero nani: పిల్లనివ్వడానికి అమ్మాయి పేరెంట… […]
[…] Also Read: Hero nani: పిల్లనివ్వడానికి అమ్మాయి పేరెంట… […]
[…] Also Read: Hero nani: పిల్లనివ్వడానికి అమ్మాయి పేరెంట… […]