Prabhas On Simhadri: యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే… ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో రాజమౌళి (Rajamouli) ఒకరు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆయన సినిమాలకు మంచి డిమాండ్ అయితే ఉంది. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో భారీ పెను ప్రభంజనాలను సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. బాహుబలి(Bahubali) సినిమా సమయంలో ఆ సినిమా రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. నిజానికి రాజమౌళి మొదటి సినిమా ఆయన స్టూడెంట్ నెంబర్ వన్ (Student Number One) సినిమాని ప్రభాస్ తో చేయాల్సింది. కానీ ప్రభాస్ కి ఆ కథ నచ్చకపోవడం వల్ల ఆ సినిమా స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేశాడు. దాంతో రాజమౌళి మొదట హీరోగా ఎన్టీఆర్ ను తీసుకొని ఆ సినిమాతో సక్సెస్ ని సాధించాడు. ఇక ఈ సినిమా తర్వాత చేసిన సింహాద్రి (Simhadri) సినిమా సైతం చాలా మంచి విజయాన్ని సాధించింది. అయితే సింహాద్రి సినిమా చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ కి ఫోన్ చేసి మరి ప్రివ్యూ చూద్దాం రా అని పిలిచారట. దాంతో ప్రభాస్ ఆ సినిమా చూడ్డానికి వెళ్ళాడు. ఆ సినిమా చూస్తున్న సమయంలో ప్రభాస్ కి రాజమౌళి గురించి అర్థమైందట.
సినిమా మొత్తం పూర్తయిన తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ అనే కథ చెప్పిన దర్శకున్నీ నేను రిజెక్ట్ చేసాను. ఇక సింహాద్రి సినిమా అల్టిమేట్ గా ఉంది ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించబోతుంది ఈ దర్శకుడితో మనం ఫ్యూచర్ లో సినిమా చేస్తామా అనే ఒక డైలమాలో ఉన్నారట. సరిగ్గా అదే సమయానికి సింహాద్రి సినిమా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ అయిన తర్వాత రాజమౌళి పిలిచి మరి ప్రభాస్ తో మనం సినిమా చేస్తున్నాం…
టైటిల్ పేరు ఛత్రపతి అని చెప్పడంతో ప్రభాస్ చాలా ఆనందపడ్డారట. మొత్తానికైతే ఈ సినిమాతో ప్రభాస్ కి చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. రాజమౌళి లాంటి దర్శకుడు ఇలాంటి స్టార్ హీరో తో సినిమా చేసి సూపర్ సక్సెస్ లను సాధిస్తూ రావడం వలన అతని అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇక బాహుబలి రెండు పార్టులతో భారీ విజయాన్ని అందుకున్న ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తే చూడాలని అభిమానం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బాహుబలి పెళ్లి ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి…