Hari Hara VeeraMallu : పవన్ కళ్యాణ్(Deputy CM PAwan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara VeeraMallu) చిత్రం వచ్చే నెల 12 న విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొన్నటి నుండి మొదలు అయ్యాయి. నార్త్ అమెరికా లో ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ చాలా డీసెంట్ గా ఉంది కానీ, పవన్ కళ్యాణ్ రేంజ్ సినిమాకు ఉండాల్సిన రేంజ్ లో అయితే ప్రస్తుతానికి లేవు. కారణంగా మామూలు ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఒక్క ప్రమోషనల్ కంటెంట్ కూడా బయటకు రాకపోవడమే. ఇప్పటి వరకు రెండు గ్లింప్స్ వీడియోస్ విడుదల చేసారు, మూడు పాటలు విడుదల చేశారు. ఒక్క దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ డైలాగ్స్ లేకపోవడం గమనార్హం. ఆ కంటెంట్స్ విడుదలై నెలలు గడిచిపోయాయి.
Also Read : మైత్రీ మూవీ మేకర్స్ మీద కోపం తో సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని రిస్క్ లో పడేసిన ‘ఆ నలుగురు’!
కేవలం అభిమానులకు తప్ప, మూవీ లవర్స్ ని ఆకర్షించే ఒక్క కంటెంట్ కూడా లేకపోవడం వల్లే ఈ సినిమాకు పవర్ స్టార్ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 28 న ట్రైలర్ విడుదల అవుతుందని అంతా ఆశించారు కానీ, ఇప్పుడు ఆ ట్రైలర్ స్థానం లో నాల్గవ పాట వస్తుందని డైరెక్టర్ జ్యోతి కృష్ణ నిన్న ట్విట్టర్ స్పేస్ లో అధికారికంగా అభిమానులకు చెప్పాడు. దీంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మీరు తీసింది ఒక వారియర్ సినిమానా?, లేకపోతే అన్నమయ్య , రామదాసు లాంటి సినిమా తీసారా?, ఎంతసేపు పాటలు విడుదల చేస్తామని అంటారేంటి అంటూ అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సినిమాలకు ఆడియన్స్ లో ఆసక్తిని తీసుకొని రావాలంటే గ్రాండియర్ తో పాటు VFX , డైలాగ్స్ వంటివి మాత్రమే ఉపయోగపడుతాయి, పాటలతో పని అవ్వదు అని అంటున్నారు ఫ్యాన్స్.
మరోపక్క డైరెక్టర్ జ్యోతి కృష్ణ నిన్నటి ట్విట్టర్ స్పేస్ లో ‘అభిమానులు ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు సార్’ అని అడిగితే, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘ఇప్పుడు మేము ట్రైలర్ విడుదల చేస్తే మీరు కచ్చితంగా రిలీజ్ ట్రైలర్ కావాలని కోరుతారు. అందుకే చాలా అడ్వాన్స్ గా ట్రైలర్ కట్ చేసాము’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం హీరో ఇంకా డబ్బింగ్ చెప్పలేదు అందుకే ట్రైలర్ రాలేదని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ సమాచారం ఏమిటంటే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని జూన్ 3 తేదీన నార్త్ అమెరికా లోని ఒక ప్రాంతం లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఓపెనింగ్ వస్తుంది అనే దానిపై అంచనా వస్తుందని అంటున్నారు.