Megastar: ‘‘చిరంజీవి కనిపించకుండా నటించండి.. అది చూడాలనుంది..’’ మెగాస్టార్ కు ఘాటు లేఖ సంచలనం

Megastar: మెగాస్టార్ చిరంజీవికి ఓ హార్డ్ కోర్ ఫ్యాన్ రాసిన లేఖ సంచలనమవుతోంది. సోషల్ మీడియాను ఊపేస్తోంది. చిరంజీవిని అభిమానులమైన తాము ఎలా చూడాలనుకుంటున్నామో ఆ లేఖలో ఘాటు పదాలతో ‘కర్ర విరగకుండా చిరంజీవికి దెబ్బపడేలా’ వివరించాడు. రిమేకులపై ఆధారపడిన చిరంజీవి ఆ అభిమాని లేఖలో కడిగేశాడు. ‘మన దగ్గర కథలు లేవా? కథనాలు లేవా? మీరు ఏదో మాటవరసకి ‘అర్థాకలి’ అంటూ ఉంటారు గానీ.. మీకు ఆకలే లేదు. ఆ సూర్యం పాత్రలో ‘నేను సైతం’ […]

Written By: NARESH, Updated On : December 7, 2021 6:57 pm

letter-to-chiru

Follow us on

Megastar: మెగాస్టార్ చిరంజీవికి ఓ హార్డ్ కోర్ ఫ్యాన్ రాసిన లేఖ సంచలనమవుతోంది. సోషల్ మీడియాను ఊపేస్తోంది. చిరంజీవిని అభిమానులమైన తాము ఎలా చూడాలనుకుంటున్నామో ఆ లేఖలో ఘాటు పదాలతో ‘కర్ర విరగకుండా చిరంజీవికి దెబ్బపడేలా’ వివరించాడు.

fan-open-letter-to-megastar-chiranjeevi-we-dont-want-these-remake-moviesd

రిమేకులపై ఆధారపడిన చిరంజీవి ఆ అభిమాని లేఖలో కడిగేశాడు. ‘మన దగ్గర కథలు లేవా? కథనాలు లేవా? మీరు ఏదో మాటవరసకి ‘అర్థాకలి’ అంటూ ఉంటారు గానీ.. మీకు ఆకలే లేదు. ఆ సూర్యం పాత్రలో ‘నేను సైతం’ అంటూ బయటకొచ్చే నటుడు నాకు కనిపించట్లేదు.’ అంటూ చిరంజీవి తీరును సుతిమెత్తగా దెప్పి పొడిచాడు.

Also Read: ఏళ్లు గడిచినా చిరంజీవిని వేధిస్తున్న అవమానభారం!

‘మీ రేంజ్ ఏంటి మీరు చేసే కథలేంటి? ఇంకెన్ని రోజులండి ఈ కథలు రాయడం రాని కథకులతో.. వీళ్లు సీన్లు తీయడంలో సినిమాని మర్చిపోయారు. మీరు పస్తు ఉండండి కొన్నిరోజులు. చిరంజీవి కనిపించకుండా నటించండి.. అది చూడాలనుంది. తప్పుగా భావించకండి మీకు అద్దం చూపించాలి’ అంటూ చిరంజీవి పాత చింతకాయపచ్చడి కథలతో తీస్తున్న సినిమాలపై సునిశిత విమర్శలు చేశారు.

ఒక సినిమాలో ఆ తార కాకుండా ఆ పాత్ర మాత్రమే కనిపించినప్పుడు అది అసలి నటన.. కన్యాశుల్కంలో ఎన్టీఆర్ కనిపించడు. గిరీశం మాత్రమే కనిపిస్తాడు.. చంటబ్బాయిలో చిరంజీవి కనిపించడు.. పాండురంగారావు మాత్రమే ఉంటాడు.. ‘నాకు ఆ చిరంజీవి కావాలి’ అంటూ అభిమాని తన మనసులోని కోరికను మెగాస్టార్ ను ట్యాగ్ చేస్తూ అడిగేశాడు. మరి దీన్ని చిరంజీవి పాటిస్తాడా? లేదా? అన్నది చూడాలి. ప్రస్తుతానికి ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: మెగాస్టార్​ ఆల్​టైమ్ రికార్డ్​.. ఒకే నెలలో వరుసగా సెట్స్​పైకి నాలుగు సినిమాలు

అభిమాని రాసిన లేఖ ఇదే..