Naga Chaitanya: సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అక్కినేని నాగార్జున.. బంగార్రాజుగా సందడి చేసి థియేటర్లలో కేకలు పెట్టించారు. తాజాగా, ఇదే పాత్రతో మరోసారి అలరించేందకు సిద్ధమవుతున్నాడు. బంగార్రాజు టైటిల్‌తో కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రానున్న సినిమాలో నాగార్జున నటిస్తున్నారు. ఇందులో నాగ్‌తో పాటు, నాగచైతన్య కూడా కనిపించనున్నారు. గతంలో వీరిద్దరు ఒకే స్క్రీన్‌పై అలరించిన సినిమా మనం. మళ్లీ ఇప్పుడు వెండి తెరపై ప్రేక్షకులను పలకరించేందుకు సై అంటున్నారు.
కాగా, తాజాగా, ఈ సినిమా నుంచి లడ్డుండా అనే లిరికల్ పాటను విడదల చేశారు. ధనుంజయ, మోహన భోగరాజ, హరిప్రియ, నూతన్ మోహన్ ఈ పాటను ఆలపించారు. అబ్బాయి హార్మోనీ.. డంటకు డడనా అంటూ.. నాగార్జున హుషారెత్తించేలా పాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నాగచైతన్య పోస్ట్ చేస్తూ.. నీ ఎనర్జీ ఎవ్వరూ మ్యాచ్ చేయలేదు అని ట్వీట్ చేశారు.
సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరక్కిస్తోన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ కనిపించనుండగా.. చైతన్య సరసన కృతి శెట్టి నటించనుంది. అనూప్ రూబెన్స్ స్వరాలు అందిస్తున్నారు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది.
Nana no one can match your swag !
Here’s the first lyrical #Laddunda from #Bangarraju https://t.co/xdqepkq4S9@iamnagarjuna @IamKrithiShetty @kalyankrishna_k @AnnapurnaStdios @anuprubens @ZeeStudios_@lemonsprasad @zeemusiccompany— chaitanya akkineni (@chay_akkineni) November 9, 2021
మరోవైపు, థాంక్యు సినిమాతో పాటు, ఓ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు సన్నాహాలు ప్రారంభించారు నాగ చైతన్య. నాగార్జున కూాడా ఘోస్ట్ సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు.