
Tollywood Hero Arrest: ప్రముఖ నటుడు, సినీ ఆర్టిస్ట్ అయిన కృష్ణుడు అరెస్ట్ అయినట్టు మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు సమాచారం అందుతోంది.
హీరో కృష్ణుడుతోపాటు మరో ఎనిమిది మందిని కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పాపార్క్ విల్లాలో పేకాట ఆడుతున్నట్లు గుర్తించిన పోలీసులు హీరో కృష్ణుడిని అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు.
హీరో కృష్ణుడుతోపాటు ప్రధాన నిర్వాహకుడు పెద్దిరాజు, మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు మియా పూర్ పోలీసులు చాలా ప్లానింగ్ గా అటాక్ చేసి ఈ పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్టు తెలిసింది.
కాగా ఈ విషయాన్ని పోలీసులు చాలా గోప్యంగా ఉంచారని తెలిసింది. కృష్ణుడు తెలుగు సినిమాల్లో హీరోగా.. కమెడియన్ గా.. మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. ప్రస్తుతం సినిమాలేవి లేకుండా ఖాళీగానే ఉన్నారు.