Kiran Abbavaram Engagement: రూమర్స్ ఆ పై క్లారిటీ.. ఇలాంటివి చిత్ర పరిశ్రమలో కామన్ అనే చెప్పాలి. ముందుగా ఎవరైనా నటీనటులు కలిసి కనిపిస్తే వారు రిలేషన్ లో ఉన్నట్టు అనుమానిస్తారు చాలా మంది. ఆ తర్వాత వారి స్నేహం కంటిన్యూ అయితే ఇంకింత ఎక్కువ అనుమానం వ్యక్తం చేస్తారు. అందులో కొందరు డేటింగ్ లో ఉంటే.. కొందరు కేవలం స్నేహితులుగా మాత్రమే మిగిలిపోతారు. మరికొందరు మాత్రం పెళ్లి వరకు వెళ్తారు. అలాంటి కోవకే చెందుతారు కిరణ్ అబ్బవరం, రహస్య ఘోరక్. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఎట్టకేలకు మరో టాలీవుడ్ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్దమయ్యాడు. ఈయన ఎవరో కాదు కిరణ్ అబ్బవరం. గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న రూమర్స్ కు చెక్ పెడుతూ అవును మేము ప్రేమలో ఉన్నామని చెప్పకనే చెప్పాడు. నటి రహస్య ఘోరక్ ఈయన ప్రేమలో ఉన్నట్టు ఎప్పటి నుంచో రూమర్స్ వచ్చాయి. ఇక వీరి ఎంగేజ్మెంట్ తో ఆ అనుమానాలకు తెర పడింది. 2019లో రాజావారు రాణిగారు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు కిరణ్ అబ్బవరం. అదే సినిమాలో ఆయనకు జోడీగా నటించి రహస్య ఘోరక్.
ఈ జంట ఈ రోజు పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక వీరి రిలేషన్ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల పాటు వాటి గురించి మాట్లాడలేదు. వీరిలో ఏ ఇద్దరు కూడా స్పందించకపోవడంపై ఈ పుకార్లు మరింత పెరిగాయి.
తాజాగా ఎంగేజ్మెంట్ తో పాత వార్తలన్నింటికి పులిస్టాప్ పెట్టేసింది ఈ కొత్త జంట. అయితే కిరణ్ అబ్బవరం రాజావారు రాణివారు అనే సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. ఈ హీరో ప్రస్తుతం దిల్ రుబా సినిమాతో పాటు 1970వ దశకం నేపథ్యంతో రాబోయే మరొక సినిమాలో నటిస్తున్నారు. మరి ఈ సినిమాలు ఆయనకు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తాయో చూడాలి.
View this post on Instagram