Karthik Aryan : ఒక మనిషి మీద ప్రేమ ఎందుకు పుడుతుందో చెప్పలేం. ఎందువల్ల ప్రేమిస్తున్నామో కూడా వివరించలేం. అది ఒక అనుభూతి. ఆ అనుభూతిని కలకాలం నిలుపుకోవాలంటే ప్రేమలో నిజాయితీ ఉండాలి. అలా నిజాయితీ ఉన్న ప్రేమలే వర్ధిల్లుతుంటాయి. నిజాయితీ లేనివి కొంతకాలంలోనే ముగిసిపోతుంటాయి. ఇలా ముగిసిపోయే ప్రేమలు సినిమా ఇండస్ట్రీలో చాలా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిల్లో బాలీవుడ్ హీరో, హీరోయిన్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అయితే ఇటీవల బాలీవుడ్ లో ఎక్కువగా ఒక యువ హీరో పేరు వినిపించింది. అయితే అతడేం అమాయకుడు కాదు. కాకపోతే ఆ హీరోయిన్లు అతడిని స్వాతిముత్యం లో కమల్ హాసన్ అంటున్నారు.. కానీ అతను మాత్రం ఒకరికి తెలియకుండా ఒకరితో యవ్వారం నడిపాడు. చివరికి తెలిసిపోవడంతో సిగ్గుతో తలదించుకుంటున్నాడు..
కార్తీక్ ఆర్యన్.. బాలీవుడ్ సంచలనం.. అల వైకుంఠపురం బాలీవుడ్ రీమేక్ షేహజాదా లో నటించాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. అంతకుముందు సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా ఆలీ ఖాన్ తో లవ్ ఆజ్ కల్ -2 లో నటించాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఆమెను ముగ్గులో దింపాడు. కొంతకాలం ఇద్దరు బాగానే తిరిగారు. అదే సమయంలో దోస్తానా-2 షూటింగ్ మొదలైంది. అందులో అతనికి జోడిగా జాన్వీ కపూర్ నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే జాన్వికి దగ్గరయ్యాడు. కాకపోతే దోస్తానా-2 సినిమా షూటింగ్ మధ్యలోనే అటకెక్కింది. కార్తీక్ ఒకరికి తెలియకుండా ఒకరితో యవ్వారం నడిపి జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు. అయితే ఇక్కడ జాన్వి, సారా ఇద్దరూ ప్రాణ స్నేహితులు కావడం విశేషం. వారిద్దరూ మాట్లాడుకునే సమయంలో కార్తిక్ వ్యవహారం చర్చకు వచ్చింది. ఇంకేముంది ఇద్దరూ కటీఫ్ చెప్పారు. అలా వారితో అతడి డబుల్ గేమ్ ముగిసింది.
ఇటీవల నేహా ధూపియా కు కార్తీక్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.. ఈ సందర్భంగా తన ప్రేమ వ్యవహారాల గురించి ప్రస్తావించాడు..”ఇద్దరు ప్రాణ స్నేహితులతో డేటింగ్ చేశావు కదా? ఏమైనా అపరాధ భావం కనిపిస్తోందా?” అని నేహా ప్రశ్నించగా..”నాకు ఇబ్బందిగానే అనిపిస్తోంది.. కాకపోతే నాతో బ్రేకప్ అయిన తర్వాత వాళ్లు ప్రాణ స్నేహితులు అయితే.. ఏది ఏమైనప్పటికీ నాకు అపరాధ భావంగానే ఉంది” అని కార్తీక్ బదులిచ్చాడు..” నీకు సారా కనిపిస్తే ముందు ఏం మాట్లాడతావ్” అని నేహా ప్రశ్నించగా..” ప్రస్తుతం నీ జీవితం ఎలా ఉంది? అంతా సవ్యంగానే సాగుతోందా? కెరియర్ ఎలా ఉంది? కొత్త ప్రాజెక్టులు ఏమైనా కమిట్ అయ్యావా” అని అడుగుతానంటూ కార్తీక్ బదులిచ్చాడు. ఇవే కాకుండా ఇంకా కార్తీక్ ను చాలా ప్రశ్నలు నేహా అడిగింది. ప్రస్తుతం కార్తీక్ చేతులో చాందు చాంపియన్, భూల్ బులయ్యా -3, ఆషిఖీ-3 చిత్రాలు ఉన్నాయి. కార్తీక్ ఆర్యన్ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. అటు సారా, ఇటు జాన్వి ఎలా బదులిస్తారోనని బాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.