Hero Gopichand: షోలో సహనం కోల్పోయి యాంకర్ సుమ గొంతు పట్టుకున్న హీరో గోపీచంద్!

  Hero Gopichand: గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించిన రామ బాణం మూవీ విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ సుమ అడ్డా షోలో పాల్గొన్నారు. గోపీచంద్, డింపుల్ హయాతి, దర్శకుడు శ్రీవాస్, కమెడియన్ గెటప్ శ్రీను సుమ షోలో సందడి చేశారు. సాధారణంగా సుమ అందరితో ఆడుకుంటారు. ఆమెతో గోపీచంద్ ఆడుకున్నారు. వరుస పంచులతో సుమను ఉక్కిరిబిక్కిరి చేశారు. సుమ, ఏజ్ గ్లామర్ మీద గోపి చంద్ పంచులు ఓ రేంజ్ […]

Written By: Shiva, Updated On : April 25, 2023 11:01 am
Follow us on

 

Hero Gopichand: గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించిన రామ బాణం మూవీ విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ సుమ అడ్డా షోలో పాల్గొన్నారు. గోపీచంద్, డింపుల్ హయాతి, దర్శకుడు శ్రీవాస్, కమెడియన్ గెటప్ శ్రీను సుమ షోలో సందడి చేశారు. సాధారణంగా సుమ అందరితో ఆడుకుంటారు. ఆమెతో గోపీచంద్ ఆడుకున్నారు. వరుస పంచులతో సుమను ఉక్కిరిబిక్కిరి చేశారు. సుమ, ఏజ్ గ్లామర్ మీద గోపి చంద్ పంచులు ఓ రేంజ్ లో పేలాయి. జయం మూవీ స్పూఫ్ చేశారు. హీరోయిన్ సదాలా నటించిన సుమ ‘వెళ్ళవయ్యా వెళ్ళు’ అంటూ గోపీచంద్ ని ఉద్దేశిస్తూ డైలాగ్ చెప్పారు.

‘ఇంత దగ్గరగా చూశాక వెళ్ళక ఛస్తానా?’ అని గోపీచంద్ పంచ్ వేశారు. ‘మీరు ఈ మూవీ హీరోయిన్ అయితే నేను విలన్ గా చేయడమే బెటర్…’ అంటూ మరో పంచ్ వేశాడు. ఎపిసోడ్ చివర్లో గోపీచంద్ యాంకర్ సుమ పీక పట్టుకున్నారు. సుమ అడ్డా ప్రోమోలో ఇది హైలెట్ అయ్యింది. అసలు ఏం జరిగింది, సుమ పట్ల గోపీచంద్ ఎందుకు సీరియస్ అయ్యాడని చర్చ నడుస్తుంది. అయితే ఇదంతా వట్టిదే. ఎపిసోడ్ కి హైప్ తెచ్చేందుకు చేసిన ట్రిక్ అని పలువురు కొట్టిపారేస్తున్నారు.

ఇక రామబాణం విజయం అటు గోపీచంద్ కి ఇటు డైరెక్టర్ శ్రీవాస్ కి చాలా అవసరం. వీరిద్దరూ వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. గోపిచంద్ గత ఏడాది పక్కా కమర్షియల్ తో గోపీచంద్ ప్రేక్షకులను పలకరించారు. దర్శకుడు మారుతి తెరకెక్కించిన పక్కా కమర్షియల్ ప్లాప్ అయ్యింది. గోపీచంద్ ఆశలు గల్లంతయ్యాయి. హీరోయిన్ డింపుల్ హయాతీ కూడా కెరీర్లో స్ట్రగుల్ అవుతున్నారు.

రవితేజకు జంటగా ఆమె నటించిన ఖిలాడి నిరాశపరిచింది. కాబట్టి రామబాణం విజయం మీద గోపీచంద్, శ్రీవాస్, డింపుల్ హయాతీ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ఈ మూవీ అద్భుతంగా వచ్చింది. ఈసారి హిట్ కోరుతున్నామని యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 5న రామబాణం విడుదల కానుంది. సమ్మర్ సీజన్ ని రామబాణం యూనిట్ ఏ మేరకు ఉపయోగించుకుంటారో చూడాలి…