https://oktelugu.com/

Hero Gopichand :  హీరో గోపీచంద్ బాలనటుడిగా నటించిన సినిమా అదేనా..? ఇన్ని రోజులు ఎవ్వరూ గుర్తించలేదుగా!

'యజ్ఞం' సినిమాతో హీరో గా మరోసారి వెండితెర మీద కనిపించిన గోపీచంద్ కి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా చెక్కుచెదరని మార్కెట్ తో ఇండస్ట్రీ లో దూసుకుపోతున్నాడు గోపీచంద్.

Written By:
  • Vicky
  • , Updated On : November 3, 2024 / 08:40 PM IST

    Hero Gopichand

    Follow us on

    Hero Gopichand  : మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోలలో ఒకడు గోపీచంద్. ‘తొలివలపు’ అనే చిత్రంతో హీరో గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన, ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అవ్వడంతో కొంతకాలం బ్రేక్ ఇచ్చి, డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ‘జయం’ చిత్రం ద్వారా విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. హీరో పాత్ర కంటే ఆరోజుల్లో గోపీచంద్ పోషించిన విలన్ పాత్రకు ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత వరుసగా ఆయన ‘నిజం’, ‘వర్షం’ వంటి చిత్రాలలో విలన్ గా చేసాడు. అలా విలన్ గా ఆడియన్స్ లో ఒక ఇమేజి ని ఏర్పాటు చేసుకున్న తర్వాత హీరో గా మారి సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టమైన విషయం. కేవలం చిరంజీవి, రజినీకాంత్, కృష్ణం రాజు, మోహన్ బాబు వంటి వారికి మాత్రమే ఇది సాధ్యమైంది. వీళ్ళ తర్వాత ఆ లిస్ట్ లోకి చేరిన హీరో గోపీచంద్. ‘యజ్ఞం’ సినిమాతో హీరో గా మరోసారి వెండితెర మీద కనిపించిన గోపీచంద్ కి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా చెక్కుచెదరని మార్కెట్ తో ఇండస్ట్రీ లో దూసుకుపోతున్నాడు గోపీచంద్.

    ఇదంతా పక్కన పెడితే గోపీచంద్ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈయన ప్రముఖ దర్శకుడు టీ కృష్ణ కొడుకు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆరోజుల్లో ఈయన ‘నేటి భారతం’, ‘దేశంలో దొంగలు పడ్డారు’, ‘దేవాలయం’, ‘వందేమాతరం’, ‘ప్రతిఘటన’, ‘అర్ధరాత్రి స్వతంత్రం’, ‘రేపటి పౌరులు’ వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించాడు. వీటిలో అత్యధిక శాతం ఇండస్ట్రీ ని షేక్ చేసిన చిత్రాలే ఉన్నాయి. చేసింది తక్కువ సినిమాలే అయ్యినప్పటికీ నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ తో ఇండస్ట్రీ లోకి దూసుకెళ్లాడు టీ కృష్ణ. అయితే దురదృష్టం కొద్దీ ఈయన కేవలం 36 ఏళ్ళ వయస్సులోనే అనారోగ్యంతో చనిపోవాల్సి వచ్చింది. చిన్నతనం లోనే తండ్రిని కోల్పోయిన గోపీచంద్, ఆర్థికంగా వాళ్ళ కుటుంబం ఎన్ని కష్టాలు పడిందో ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి.

    ఇది ఇలా ఉండగా గోపీచంద్ చిన్నతనం లోనే ఒక సినిమాలో బాలనటుడిగా నటించాడు అనే విషయం చాలా మందికి తెలియదు. ఆయన తండ్రి తెరకెక్కించిన ‘దేశంలో దొంగలు పడ్డారు’ అనే చిత్రంలో ఒక చిన్న పాత్రలో ఆయన కనిపిస్తాడు. తక్కువ నిడివి ఉన్న పాత్ర అయినప్పటికీ కూడా, ప్రేక్షకులు గుర్తించుకోదగ్గ పాత్రనే తన కొడుకు కోసం రాసుకున్నాడు టీ కృష్ణ. అదే విధంగా ఆయన తెరకెక్కించిన ‘రేపటి పౌరులు’ అనే చిత్రంలో కూడా గోపీచంద్ ని నటింపచేయాలని అనుకున్నాడట. ఈ సినిమా చిన్న పిల్లల మీద తీసిన సంగతి తెలిసిందే. అయితే డేట్స్ ఎక్కువ కావాల్సి ఉండగా, గోపీచంద్ చదువుకి ఆటంకం కలిగే పరిస్థితి ఉన్నందున ఆ ఆలోచనను విరమించుకున్నాడు టీ కృష్ణ. ఇక గోపీచంద్ రీసెంట్ గానే ‘విశ్వం’ చిత్రంతో సూపర్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలం నుండి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న గోపీచంద్ కి ఈ చిత్రం కాస్త ఉపశమనం కలిగించింది. రీసెంట్ గానే ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసారు.