Iran : ఇజ్రాయెల్‌పై కయ్యానికి కాలుదువ్వుతోంది ఇరాన్. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే హమాస్, హెజ్‌బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా ఇరన్‌పైనా దాడులకు సిద్ధమవుతోంది. ఇలాంటి తరుణంలో ఇరాన్‌లో మహిళల దుస్తులపై కఠిన నియమాలు అమలు చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మహిళలు పూర్తిగా తలకు స్కార్ఫ్‌లు, పూర్తిగా వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. అయితే ఇటీవల ఇరాన్‌లో ఈ నియమాలను ఉల్లంఘిస్తూ ఓ మహిళ తన దుస్తులు విప్పి నిరసన తెలిపింది. ఈ ఘటన టెహ్రాన్‌లోని ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్‌లో జరిగింది. నైతిక పోలీసులుగా వ్యవహరించే బాసిజ్ మిలీషియా ఆ మహిళను అవమానించారని, ఆమె హిజాబ్, బట్టులు విప్పినట్లు తెలుస్తుంది. ఈ అవమానంతో చలించిపోయిన ఆ మహిళ యూనిర్సిటీ బయట నిరసన చేపట్టింది. వీధుల్లో తిరుగుతూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఇరాన్ అధికారులు సదరు మహిళను అరెస్ట్ చేశారు.
ఇరాన్ న్యూస్ ప్రకారం..
ఇక ఇరాన్ సంప్రదాయవాద ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. మహిళ తరగతి గదిలో అనుచిత దుస్తులు ధరించి రావడంతో సెక్యూరిటీ గాడ్డులు ఆమెను హెచ్చరించారని తెలిపారు. ఆ హెచ్చరిక తర్వాత ఆ మహిళ తన దుస్తులు విప్పేసినట్లు వివరించారు.
2022లో కూడా..
ఇరాన్‌లో మహిళలపై విధించిన దుస్తుల నియమాలకు వ్యతిరేకంగా 2022లో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. మహ్సా అమిని అనే యువతి కస్టడీలో మరణించిన తర్వాత చాలా మంది మహిళలు తమ హిజాబ్‌లను విప్పి దహనం చేశారు. ఈ నరిసనలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో 551 మంది నిరసన కారులు మరణించారు. వేలాది మంది అరెస్ట్ అయ్యారు.
Campuses in Iran becoming increasingly fed up with the regime policies and oppressive gender apartheid. Here at Iran’s University of Science and Research, a student was harassed over her “improper” hijab, so she stripped down to her underwear in protest and started pacing in… pic.twitter.com/mTEfQPuEYM
— Emily Schrader – אמילי שריידר امیلی شریدر (@emilykschrader) November 2, 2024