Bimbisara Heroine Samyuktha Menon: ‘భీమ్లా నాయక్’ చిత్రంతో మెరిసిన మలయాళ భామ ‘సంయుక్తా మీనన్’ అందంతో పాటు అభినయం ఉన్న నటి. సంయుక్త మీనన్ 2016లో ‘పాప్‌కార్న్’ అనే మలయాళం సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. 2018లో ‘కలరి’ సినిమాతో తమిళ సినీరంగానికి పరిచయమైంది. తెలుగులో భీమ్లా నాయక్ తో ఎంట్రీ ఇచ్చింది.
అలాగే, ఆమె 2022లో గాలిపట 2 సినిమాతో అటు కన్నడ సినీ రంగంలోనూ పరిచయమైంది. మొత్తానికి స్టార్ డమ్ రాకుండానే అన్నీ సౌత్ భాషల్లోనూ నటించేసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో సంయుక్తా మీనన్ కి వరుస చాన్స్ లు వస్తున్నాయి. వచ్చే వారం రిలీజ్ కాబోతున్న ‘బింబిసార’ సినిమాలో మోడ్రన్ పాత్రలో కనిపించబోతుంది.
‘బింబిసార’ రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ‘సంయుక్తా మీనన్’ వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇంటర్వ్యూల్లో తన సినీ కెరీర్ కి సంబంధించిన ముచ్చట్లతో పాటు తన పై వచ్చిన రూమర్స్ పై కూడా క్లారిటీ ఇస్తోంది.
Also Read: Botsa Satyanarayana: మంత్రుల పిల్లల చదువుపై చర్చ.. అసలేం జరిగిందంటే?
ముఖ్యంగా గతంలో తమిళ హీరో ధనుష్‌తో ‘సంయుక్తా మీనన్’కు గొడవలున్నాయంటూ బాగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై సంయుక్తా మీనన్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ‘సంయుక్తా మీనన్’ ఏమి చెప్పిందో ఆమె మాటల్లోనే విందాం. ‘మా మధ్య ఎలాంటి విభేదాల్లేవు. ఎప్పుడూ గొడవలు జరగలేదు.
ఆయనతో నాకు మంచి రిలేషన్‌షిప్ ఉంది. ధనుష్‌తో గొడవలు జరిగాయంటూ కొందరు కావాలని ప్రచారం చేశారు. ధనుష్‌తో సార్ సినిమాకు 21 రోజులు కాల్షీట్లు ఇచ్చాను. బాగా పని చేశాం’ అని చెప్పుకొచ్చింది. మొత్తానికి ధనుష్‌తో గొడవ కారణంగా ‘సంయుక్తా మీనన్’ సెట్ నుంచి వెళ్లిపోయిందని జరిగిన ప్రచారంలో కూడా ఎలాంటి వాస్తవం లేదని ఆమె చెప్పింది.
అన్నట్టు తెలుగులో కూడా ‘సంయుక్తా మీనన్’కి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. పైగా ఆమెకు త్రివిక్రమ్ సపోర్ట్ కూడా ఉంది. ‘వినోదయ సీతమ్’ సినిమా రీమేక్ గా రాబోతున్న పవన్ సినిమాలో సాయితేజ్ సరసన హీరోయిన్ గా ‘సంయుక్తా మీనన్’ కి ఛాన్స్ ఇచ్చాడు త్రివిక్రమ్. అలాగే నితిన్ సినిమాలో కూడా ఆమెకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది.
Also Read: Chikoti Praveen : ‘చీకోడి’ చిట్టాలో ఏపీ, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు?