Nayanthara: దక్షిణాదిలో సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార అనడంలో సందేహం లేదు. అందం, అభినయంలో తనదైన శైలిలో దూసుకుపోతోంది. అందరు అగ్రహీరోలతో నటించి తానేమిటో నిరూపించుకుంది. రజనీకాంత్ నుంచి కింది స్థాయి హీరోల వరకు అందరితో నటించి మెప్పించింది. టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. చక్కని హావభావాలు పలికిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ ను వివాహం చేసుకుని జీవితంలో స్థిర పడాలని భావిస్తోంది. ఇక సినిమాలకు టాటా చెబుతుందో లేక ఇంకా నటించి తన ప్రయాణం కొనసాగిస్తుందో చెప్పలేం.
దక్షిణాదిలో అందరు హీరోలతో హిట్లు కొట్టింది. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ చిత్రాల్లో నటించి తన పర్ఫార్మెన్స్ చూపించింది. దీంతో ఆమె నెంబర్ వన్ హీరోయిన్ గా స్థానం సంపాదించిందనడంలో సందేహం లేదు. అందరు హీరోయిన్టతో నయన్ బాగుంటుందని తెలుస్తోంది. ఆమెతో సమంతకు గల చనువుతో ఆమె దక్షిణాదిలోనే నెంబర్ వన్ హీరోయిన్ అని కితాబిచ్చింది. మిగతా వారందరు వేస్ట్ అనే భావంతో ఆమె మాట్లాడటంతో ప్రముఖ దర్శకుడు కరణ్ స్పందించారు. అంత సీన్ లేదు. నా దృష్టిలో ఆమెకంత సీన్ లేదని చెప్పడంతో రగడ ప్రారంభమైంది.
Also Read: Modi Government: మోడీ సర్కార్ మరింత రెచ్చిపోవచ్చు.. ఈడీకి పగ్గాల్లేవంటున్న సుప్రీంకోర్టు
నయనతార అభిమానులు నొచ్చుకుంటున్నారు. కరణ్ మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగతావారు మాత్రం దక్షిణాదిలో ఆమె నెంబర్ వన్ అనడంలో అర్థమేమిటి? మిగతా వారు లేరా? ఆమెకు అంత స్థానం ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. నయనతార మంచి నటిగా అందరు ఒప్పుకుంటారు. కానీ మిగతా వారు వేస్ట్ అనడం సముచితం కాదని హితవు పలుకుతున్నారు. దక్షిణాదిలో నయనతారను మించిన వారు లేరనడం కాస్త అతిశయోక్తి అవుతుందని బదులిస్తున్నారు.
ఇటీవల దర్శకుడు విఘ్నేష్ ను వివాహం చేసుకుని తిరుమల చేరుకుని కాళ్లకు చెప్పులు వేసుకుని వార్తల్లో హల్ చల్ చేసింది. అలాంటి నయనతార నెంబర్ వన్ ఎలా అవుతుందని చెబుతున్నారు. ఆమె తప్ప మిగతా వారు పనికిరారని చెప్పడం మాత్రం ఎక్కువే. దీనికి ఎవరు ఎన్ని చెప్పినా కూడా సమంత వ్యాఖ్యలు కాస్త ఎబ్బెట్టుగానే ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. నయనతార తన అందంతో అందరిని మెప్పించింది. అవకాశాలు కూడా రాబట్టుకుంది. కానీ మిగతా వారు కూడా ఉన్నారు కదా ఆమె నెంబర్ వన్ అనడం సరికాదని చెబుతున్నారు. మొత్తానికి నయనతార విషయంలో అభిమానుల్లో పలు మాటలు సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తూనే ఉన్నాయి.
Also Read: Manchu Lakshmi: ఇంతకీ మంచు లక్ష్మీని మోసం చేసింది ఎవరు..? వైరల్ గా మారిన పోస్ట్