https://oktelugu.com/

Court Movie : విడుదలైన వారంలోపే ఓటీటీ లోకి ‘కోర్ట్’..ఎందులో చూడొచ్చంటే!

Court Movie : ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి పోటీ మామూలు రేంజ్ లేదు. అయితే ఎట్టకేలకు వరుసగా నాని హీరోగా నటిస్తున్న సినిమాలను కొంటూ వచ్చిన నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకుంది . థియేటర్స్ లో థియేట్రికల్ రన్ పూర్తి అయిన వెంటనే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్(Netflix) లోకి అందుబాటులోకి వచ్చేస్తుంది.

Written By: , Updated On : March 19, 2025 / 09:33 PM IST
Court

Court

Follow us on

Court Movie : ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ రేంజ్ వసూళ్లను రాబడుతున్న చిత్రం ‘కోర్ట్'(Court Movie). నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మాతగా వ్యవహరించిన చిత్రమిది. అనేక సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన హర్ష రోషన్ ఇందులో హీరోగా నటించగా, శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. ప్రియా దర్శి ఇందులో కీలక పాత్రలో పోషించాడు. చాలా కాలం తర్వాత మన టాలీవుడ్ లో వచ్చిన పర్ఫెక్ట్ కోర్ట్ రూమ్ డ్రామా ఇది. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం డైరెక్టర్ ఎలాంటి హంగులు, ఆర్భాటాలకు పోకుండా, కేవలం కోర్ పాయింట్ మీద ఫిక్స్ అయ్యి తీసిన సినిమా ఇది. అందుకే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ ముందుకు వెళ్తుంది. కేవలం 5 రోజుల్లో 32 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

Also Read : ‘కోర్ట్’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇంత గ్రాస్ ఎవ్వరూ ఊహించి ఉండరు!

ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి పోటీ మామూలు రేంజ్ లేదు. అయితే ఎట్టకేలకు వరుసగా నాని హీరోగా నటిస్తున్న సినిమాలను కొంటూ వచ్చిన నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకుంది . థియేటర్స్ లో థియేట్రికల్ రన్ పూర్తి అయిన వెంటనే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్(Netflix) లోకి అందుబాటులోకి వచ్చేస్తుంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. తెలుగు తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ ని చూస్తుంటే నెట్ ఫ్లిక్స్ విడుదల మరింత వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.

కారణం బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీ రన్ ఉండడమే. వర్కింగ్ డేస్ ఈ సినిమా పెడుతున్న ఆక్యుపెన్సీలను చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే రేంజ్ స్టడీ రన్ రెండవ వారం, మూడవ వారం లో కూడా ఏప్రిల్ మూడవ వారానికి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. కేవలం 7 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి ఇప్పటి వరకు 16 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి.అంటే దాదాపుగా 10 కోట్ల రూపాయిల లాభాలు ఇప్పటి వరకు వచ్చాయి అన్నమాట. ఫుల్ రన్ లో ఇంకా కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి. నాని ఇప్పటి వరకు నాలుగు సినిమాలను నిర్మించాడు. ఈ నాలుగిట్లో అతి పెద్ద హిట్ ఏదైనా ఉందా అంటే అది ‘కోర్ట్’ చిత్రం మాత్రమే. చూడాలి మరి ఈ సినిమా థియేట్రికల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో.

Also Read: ధనుష్ విడాకులకు కారణం అమలాపాల్..? వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్